దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
కర్ణాటకలో ఒక్కరోజే 10 వేల మందికిపైగా డిశ్చార్జి - కొవిడ్ అప్డేట్స్
భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పలు రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇవాళ 21 వేల 907 కరోనా కేసులు వెలుగుచూశాయి. కర్ణాటకలో మరో 8,364 మంది కొవిడ్ బారినపడ్డారు.
కర్ణాటకలో ఒక్కరోజే 10 వేల మందికిపైగా డిశ్చార్జి
మహారాష్ట్రలో మరో 21 వేల 907 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసులు 11 లక్షల 88 వేలకు చేరాయి. మరో 425 మంది మరణించారు. మొత్తం 32 వేల 216 మంది చనిపోయారు.
కర్ణాటకలో ఇవాళ 8,364 మందికి వైరస్ సోకింది. మరో 114 మంది చనిపోయారు. అయితే.. రికార్డు స్థాయిలో రాష్ట్రంలో ఒక్కరోజే 10 వేల 815 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 5 లక్షల 11 వేలు దాటింది. మొత్తం మృతుల సంఖ్య 7,922కు చేరింది.
- మధ్యప్రదేశ్, పంజాబ్‌లో 2 వేల 600 కేసుల చొప్పున నమోదయ్యాయి.
- తమిళనాడులో మరో 5 వేల 569 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసులు 5 లక్షల 36 వేలు దాటాయి. ఇప్పటివరకు 8,751 మంది కొవిడ్‌కు బలయ్యారు.
- కొద్దిరోజులుగా పశ్చిమ్ బంగాలో కేసులు తగ్గుతున్నాయి. ఇవాళ 3,188 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 56 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 4,298కి చేరింది.
- ఉత్తరాఖండ్‌లో శనివారం 2078 మంది వైరస్ బారినపడ్డారు.
Last Updated : Sep 19, 2020, 11:03 PM IST