తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయం: 14 మంది రెబల్స్​పై అనర్హత వేటు - Karnataka

కర్ణాటక

By

Published : Jul 28, 2019, 12:14 PM IST

Updated : Jul 28, 2019, 1:27 PM IST

12:58 July 28

స్పీకర్​ నిర్ణయంపై సిద్ధరామయ్య హర్షం

స్పీకర్‌ నిర్ణయంపై కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధరామయ్య హర్షం వ్యక్తం చేశారు. రమేశ్​ కుమార్​ నిర్ణయం ప్రజాస్వామ్యానికి నిజమైన విజయమన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. అధికారం శాశ్వతం కాదని స్పందించారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.

" స్పీకర్​ నిర్ణయం అవకాశవాద రాజకీయాలకు గొడ్డలిపెట్టు లాంటిది, చట్టసభల్లో పాటించే సంప్రదాయాలే భావితరాలకు ఆదర్శం"  అని అన్నారు సిద్ధరామయ్య

12:33 July 28

ఎన్నికల్లో పోటీ చేయకూడదు...

కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి కారకులైన రెబల్​ ఎమ్మెల్యేలపై స్పీకర్​ రమేశ్​ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 11 మంది కాంగ్రెస్​, ముగ్గురు జేడీఎస్​ నేతలపై అనర్హత వేటు వేశారు.  ఇప్పటికే ముగ్గురిపై అనర్హత వేటు వేసిన స్పీకర్‌.. తాజాగా మరో 14 మందిపై ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ​ ఎమ్మెల్యేలు ప్రతాప్‌గౌడ పాటిల్‌, బీసీ పాటిల్‌, శివరాం హెబ్బార్‌, ఎస్‌.టి.సోమశేఖర్‌, బసవరాజు, ఆనంద్‌సింగ్‌, రోషన్‌బేగ్‌, కె.సుధాకర్‌, మునిరత్న, ఎంటీబీ నాగరాజు, శ్రీమంత్‌ పాటిల్​ను అనర్హులుగా ప్రకటించారు స్పీకర్​.

జేడీఎస్‌ ఎమ్మెల్యేలు విశ్వనాథ్‌, నారాయణ్‌గౌడ, గోపాలయ్యపైనా వేటు వేశారు. 

కర్ణాటకలో 15వ అసెంబ్లీ గడువు ముగిసే వరకు అనర్హులుగా ప్రకటించిన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయకూడదని స్పష్టం చేశారు.
 

12:14 July 28

అసమ్మతి ఎమ్మెల్యేలు వీరే...

  • కర్ణాటక స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం
  • కర్ణాటకలో 14 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
  • 11 మంది కాంగ్రెస్‌, ముగ్గురు జేడీఎస్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ వేటు
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రతాప్‌గౌడ పాటిల్‌, బీసీ పాటిల్‌, శివరాం హెబ్బార్‌పై వేటు
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎస్‌.టి.సోమశేఖర్‌, బసవరాజు, ఆనంద్‌సింగ్‌పై వేటు
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రోషన్‌బేగ్‌, కె.సుధాకర్‌, మునిరత్నపై అనర్హత వేటు
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎంటీబీ నాగరాజు, శ్రీమంత్‌ పాటిల్‌పై వేటు
  • జేడీఎస్‌ ఎమ్మెల్యేలు విశ్వనాథ్‌, నారాయణ్‌గౌడ, గోపాలయ్యపై వేటు
  • ఇప్పటికే ముగ్గురిపై అనర్హత వేటు వేసిన స్పీకర్‌ రమేశ్‌కుమార్‌
  • తాజాగా 14 మందితో కలుపుకుని 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
  • అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్‌ రమేశ్‌కుమార్‌

12:00 July 28

కర్ణాటక రెబల్​ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

కర్ణాటకలో 14 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై స్పీకర్​ రమేశ్​ కుమార్​ అనర్హత వేటు వేశారు. 11 మంది కాంగ్రెస్‌, ముగ్గురు జేడీఎస్‌ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

Last Updated : Jul 28, 2019, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details