స్టీమ్ ఇంజిన్ నుంచి అత్యాధునిక బుల్లెట్ రైళ్ల వరకు.. భారతీయ రైల్వే ప్రస్థానాన్ని చాటిచెప్పే విధంగా కర్ణాటకలో ఓ రైల్వే మ్యూజియం ఏర్పాటైంది. ఈ ప్రదర్శనను హుబ్బలి జిల్లా ప్రజలకు అంకితం చేశారు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్. హుబ్బలి ప్రజలతో భారత రైల్వేకు అవినాభావ సంబంధం ఉందని పేర్కొన్నారు.
హుబ్బల్లిలోని దక్షిణ-పశ్చిమ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు అధికారులు. 1907లో నిర్మించిన కార్టేజీలను రెండు భాగాలుగా చేసి.. ప్రదర్శనాలయం స్థాపించారు. ఓ భాగానికి మలప్రభ, మరో భాగానికి ఘాటప్రభా అనే నదుల పేర్లతో నామకరణం చేశారు.