కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక శాసనసభను రద్దు చేయాలని జేడీఎస్ సీనియర్ నేత బసవరాజ్ హోరట్టి అభిప్రాయపడ్డారు. ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలు, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న డిమాండ్లను భరించలేకే ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టం చేశారు.
బసవరాజ్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కుమారస్వామి... వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దంటూ ట్విట్టర్ వేదికగా ఇరు పార్టీల నేతలను అభ్యర్థించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. కేంద్రంలో భాజపాయేతర ప్రభుత్వాన్ని స్థాపించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం సరికాదన్నారు.
సిద్దరామయ్య విఫలమయ్యారు