కర్ణాటక రాజకీయాలను కీలక మలుపు తిప్పగల ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. గురువారం కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది.
శాసనసభలో ఉదయం 11 గంటలకు విశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం అవుతుందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య వెల్లడించారు.
14:00 July 15
బలపరీక్షకు ముహూర్తం ఖరారు
కర్ణాటక రాజకీయాలను కీలక మలుపు తిప్పగల ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. గురువారం కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది.
శాసనసభలో ఉదయం 11 గంటలకు విశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం అవుతుందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య వెల్లడించారు.
13:56 July 15
సంక్షోభంలో చిక్కుకున్న కుమారస్వామి సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు భాజపా సిద్ధమైంది. భాజపా నేత సీటీ రవి ఈ విషయం వెల్లడించారు.
12:44 July 15
బీఏసీ సమావేశం...
12:13 July 15
జేడీఎస్ ఎమ్మెల్యేలు...
దేవనహళ్లిలోని గోల్ఫ్ షైర్ రిసార్ట్ నుంచి విధానసభకు చేరుకున్న జేడీఎస్ ఎమ్మెల్యేలు
12:03 July 15
విధానసభకు కాంగ్రెస్...
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విధానసభకు హాజరయ్యారు. నేడు సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోవాలని భాజపా ఇప్పటికే డిమాండ్ చేసింది.
11:48 July 15
విధానసభకు చేరుకున్న భాజపా...
11:43 July 15
విధానసభకు పయనం...
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విధానసభకు హాజరయ్యేందుకు తాజ్ హోటల్ నుంచి పయనమయ్యారు.
11:34 July 15
కాసేపట్లో విధానసభ...
11:20 July 15
బలపరీక్ష తప్పదా..?
కన్నడనాట రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. రెండు రోజుల విరామం తరువాత కాసేపట్లో విధానసభ పునఃప్రారంభం కానుంది. గత శుక్రవారం బలపరీక్షకు సిద్ధమని సీఎం కుమారస్వామి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రెబల్ ఎమ్మెల్యేల బుజ్జగింపు ప్రక్రియలో కూటమికి అనుకున్న ఫలితమేమి రాలేదు. మరోవైపు నేటి సభలోనే బలపరీక్ష అంశాన్ని లేవనెత్తాలని భాజపా ఉన్నట్లు సమాచారం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ఈ మేరకు ఇప్పటికే కుమారస్వామి రాజీనామాకు డిమాండ్ చేశారు.