అసెంబ్లీ హాలులోనే ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప కునుకు తీశారు. భోజనం అనంతరం సహచరులతో ముచ్చటించిన యడ్డీ.. నిద్రకు ఉపక్రమించారు.
కర్ణాటకీయం: బల నిరూపణకు గవర్నర్ డెడ్‌లైన్
23:55 July 18
అసెంబ్లీ హాలులోనే యడ్యూరప్ప కునుకు
23:20 July 18
అసెంబ్లీలోనే భాజపా ఎమ్మెల్యేల నిద్ర
అసెంబ్లీలో ధర్నాలో భాగంగా అక్కడే భోజనం చేసిన భాజపా ఎమ్మెల్యేలు.. లాంజ్‌లోని సోఫాల్లో నిద్రకు ఉపక్రమించారు.
22:26 July 18
అసెంబ్లీలోనే భాజపా నేతల రాత్రి భోజనం
- విశ్వాసంపై ఓటింగ్ జరగాలన్న డిమాండ్‌తో విధాన సౌధలోనే ధర్నా దిగిన భాజపా ఎమ్మెల్యేలు.
- ప్రతిపక్షానికి కేటాయించిన లాంజ్‌లో రాత్రి భోజనం చేసిన కాషాయ నేతలు
20:50 July 18
విశ్వాసానికి గవర్నర్ డెడ్‌లైన్.. సీఎంకు లేఖ
బల నిరూపణకు సీఎం కుమారస్వామికి గవర్నర్ వాజుభాయి వాలా డెడ్‌లైన్ విధించారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటల వరకు శాసన సభ విశ్వాసం పొందాలని కుమారస్వామికి లేఖ రాశారు.
20:36 July 18
'ఓడిపోతామని తెలిసే విశ్వాసాన్ని అడ్డుకుంటున్నారు'
ఓడిపోతామని భయంతోనే శాసనసభలో విశ్వాస పరీక్షను సీఎం కుమారస్వామి జరగనివ్వట్లేదని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప ఆరోపించారు. మేం డిమాండ్ చేస్తోన్న కుమారస్వామి మాత్రం ససేమీరా అంటున్నారని విమర్శించారు. సభలో భాజపా బలం 105 ఉందనీ, కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి 98 మంది మాత్రమే ఉన్నట్లు ప్రజలకు కూడా తెలుసునని తెలిపారు. ఓటింగ్ జరిగితే గెలిచేది ఎవరో తెలుసున్నారు.
20:30 July 18
అనారోగ్యంపై పాటిల్ వివరణ
అనారోగ్యం గురించి వస్తోన్న వార్తలపై కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ వివరణ ఇచ్చారు.
"వ్యక్తిగత పనిపై చెన్నై వెళితే అక్కడ ఛాతీలో నొప్పి మొదలైంది. వైద్యులను సంప్రదించగా ఆసుపత్రి చేరాలని చెప్పారు. ముంబయి వచ్చి ఆసుపత్రిలో చేరాను. కుదుటపడగానే బెంగళూరు వస్తాను."
-శ్రీమంత్ పాటిల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే
19:55 July 18
భాజపా నేతలతో మంత్రుల చర్చలు
వాయిదా అనంతరమూ సభలోనే బైఠాయించిన భాజపా ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు కర్ణాటక మంత్రులు ఎంబీ పాటిల్, డీకే శివకుమార్.
19:34 July 18
సభలోనే బైఠాయించిన భాజపా ఎమ్మెల్యేలు
బలపరీక్ష ఈరోజే నిర్వహించి తీరాలన్న భాజపా డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకుండా సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. నిరసనగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో సభలోనే బైఠాయించారు యడ్యూరప్ప. రాత్రంతా ఇక్కడే ధర్నా నిర్వహిస్తామన్నారు.
18:26 July 18
సభ రేపటికి వాయిదా..
వాయిదా అనంతరం విధానసభ తిరిగి ప్రారంభమైంది. సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఈరోజు బలపరీక్ష జరిపి తీరాల్సిందేనని పట్టుబట్టిన ప్రతిపక్ష నేత యడ్యూరప్ప...తమ సభ్యులంతా రాత్రంతా విధానసభలోనే ఉండి ధర్నా చేస్తామన్నారు.
18:03 July 18
సభలో ఉద్రిక్త వాతావరణం
- కర్ణాటక విధానసభలో ఉద్రిక్త వాతావరణం
- ఎమ్మెల్యే శ్రీమంత్ పోస్టర్లతో సభలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన
- స్పీకర్ పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ సభ్యులు
- భాజపా తమ ఎమ్మెల్యేలపై దురాగతాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ సభ్యుల ఆందోళన
- కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో సభను10నిమిషాలు వాయిదా వేసిన స్పీకర్
17:55 July 18
చకచకా మారుతున్న పరిణామాలు..
ప్రత్యేక అధికారి ద్వారా స్పీకర్ రమేశ్ కుమార్‌కు లేఖ పంపారు కర్ణాటక గవర్నర్. ఈరోజే బలపరీక్ష నిర్వహించాలని సందేశంలో పేర్కొన్నారు. లేఖను సభలో చదివి వినిపించారు స్పీకర్.
17:10 July 18
విశ్వాస పరీక్ష ఈరోజే నిర్వహించాలని లేఖ
వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది. రాజ్‌భవన్ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి విధానసభలో ప్రొసీడింగ్స్ గమనించనున్నారు. ప్రత్యేక అధికారి సమాచారం ఆధారంగా కేంద్ర హోంశాఖకు నివేదిక పంపనున్నారు కర్ణాటక గవర్నర్.
17:01 July 18
విధానసభకు రాజ్‌భవన్ ప్రత్యేక అధికారి
కర్ణాటక గవర్నర్‌తో భాజాపా నేతలు భేటీ అయ్యారు. సభలో బలపరీక్ష జరిపించాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు.
16:24 July 18
గవర్నర్‌తో భాజపా నేతల భేటీ
శ్రీమంత్ పాటిల్ లేఖపై తనకు అనుమానాలున్నాయన్న స్పీకర్... తాను అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడాలంటూ సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు.
16:03 July 18
సభ అరగంట వాయిదా
- కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ పేరుతో లేఖ అందింది: స్పీకర్ రమేశ్‌కుమార్
- ఈ లేఖపై నాకు అనుమానాలున్నాయి: స్పీకర్ రమేశ్‌కుమార్
- శ్రీమంత్ పాటిల్ కుటుంబసభ్యులతో హోంమంత్రి మాట్లాడాలి: స్పీకర్
- ఎమ్మెల్యే ఆరోగ్యంపై పూర్తిస్థాయి నివేదిక అందించాలి: స్పీకర్
15:57 July 18
ఎమ్మెల్యే లేఖపై సభలో గందరగోళం
విప్ గురించి సుప్రీం మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టత లేదని సభాపతికి సూచించారు సిద్ధరామయ్య. సుప్రీం తీర్పు వచ్చే వరకు బలపరీక్ష వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు.
15:39 July 18
బలపరీక్ష వాయిదా వేయాలి: సిద్ధరామయ్య
చర్చ పునఃప్రారంభం...
- వాయిదా అనంతరం ప్రారంభమైన విధానసభ
- సభలో ప్రాధాన్యత సంతరించుకున్న సిద్ధరామయ్య ప్రసంగం
- కాంగ్రెస్‌పక్ష నేతగా విప్ జారీ చేసినప్పుడు సభ్యులు హాజరవ్వాలని చట్టం చెబుతోంది: సిద్ధరామయ్య
- అసెంబ్లీలో విప్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది: సిద్ధరామయ్య
- ఏ పార్టీ అయినా విప్ జారీ చేస్తే తప్పనిసరిగా ఎమ్మెల్యేలు హాజరవ్వాలి: సిద్ధరామయ్య
- సుప్రీం ఎమ్మెల్యేల హాజరు వారిష్టానికే వదిలేయడం విప్‌కు విరుద్ధమన్న సిద్ధరామయ్య
- సుప్రీం వాదనల్లో లాయర్లు, జడ్జిలెవరూ విప్ గురించి మాట్లాడలేదు: సిద్ధరామయ్య
- సిద్ధరామయ్య చెప్పిన అంశాలపై స్పీకర్ వివరణ
- సిద్ధరామయ్య లేవనెత్తిన అంశాలతో స్పీకర్ ఏకీభావం
- క్లిష్టమైన అంశాలపై ఉన్నపళంగా ఆదేశాలు ఇవ్వలేమన్న సభాపతి
- సభలో బలం లేకే కొత్త వాదనలు లేవనెత్తుతున్నారు: భాజపా
15:21 July 18
విశ్వాస పరీక్ష కోసం ...
సభలో విశ్వాస పరీక్షకు హెచ్ డీ దేవెగౌడ కుమారుడు రేవన్న కాలికి పాదరక్షలు లేకుండా హాజరయ్యారు.
15:11 July 18
సుప్రీం తీర్పులో స్పష్టత రావాలి: సిద్ధరామయ్య
చర్చ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.."విప్ అమలులో ఉండగా.. రెబల్ ఎమ్మెల్యేలు కోర్టు తీర్పు కారణంగా సభకు హాజరుకాకపోతే కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. కనుక సుప్రీం తీర్పులో స్పష్టత వచ్చే వరకూ... విశ్వాస పరీక్ష నిర్వహించడం ఆమోదయోగ్యం కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధమే" అన్నారు.
15:01 July 18
మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా...
విశ్వాస తీర్మానంపై విధానసభలో అధికార కూటమి.. ప్రతిపక్ష భాజపా మధ్య వాడివేడి చర్చ జరిగింది. కొన్ని సందర్భాల్లో సభ్యుల వాదోపవాదనలతో సభలో గందరగోళం నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్ సభను వాయిదా వేశారు. విశ్వాస తీర్మానంపై మధ్యాహ్నం చర్చ కొనసాగనుంది.
14:05 July 18
కర్ణాటక విధానసభలో మాట్లాడిన యడ్యూరప్ప
అసంతృప్త ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది:యడ్యూరప్ప
బలపరీక్షకు వెళ్లాలా వద్దా అని వాళ్లకే స్వేచ్ఛ ఇచ్చింది:యడ్యూరప్ప
అలాగే సభకు రావాలని పార్టీ విప్ జారీ చేయకూడదని చెప్పింది:యడ్యూరప్ప
విప్ జారీ చేయకూడదని సుప్రీం ఎక్కడ చెప్పిందని ప్రశ్నించిన స్పీకర్
కర్ణాటక:యడ్యూరప్ప వ్యాఖ్యలపై సభలో గందరగోళం
లేనివి కల్పించి యడ్యూరప్ప చెబుతున్నారంటూ కాంగ్రెస్ సభ్యుల ఆందోళన
13:35 July 18
రాజీనామాల వ్యవహారంపై సభలో స్పీకర్...
రాజీనామాలపై నిర్ణయాన్ని నేనే తీసుకుంటా: స్పీకర్
ఆ అంశాన్ని స్పీకర్‌కి వదిలి చర్చ కొనసాగించండి: స్పీకర్
13:18 July 18
సిద్ధరామయ్య...
నేనుగానీ, కాంగ్రెస్ పార్టీగానీ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంను ఆశ్రయించలేదు: సిద్ధరామయ్య
పార్టీ జారీచేసిన విప్ విషయంలో సుప్రీంకోర్టు ఏం మాట్లాడలేదు: సిద్ధరామయ్య
ఎమ్మెల్యేలు రావాలా వద్దా వారి ఇష్టం అంటే విప్‌కు అర్థమేంటి?: సిద్ధరామయ్య
ఇవాళ కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి వచ్చింది.. రేపు భాజపాకు వస్తే ఏంచేస్తారు: సిద్ధరామయ్య
12:53 July 18
తీర్పును గౌరవిస్తున్నాం... కానీ..
- సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సభ గౌరవిస్తుంది: స్పీకర్
- అదేసమయంలో సభా నియమాలు ఉల్లంఘన కాకూడదు: స్పీకర్
- అసంతృప్త ఎమ్మెల్యేలకు ఏ సమస్యలైనా ఉండవచ్చు: స్పీకర్
- సభ సమావేశాలు జరుగుతుంటే వాళ్లు బయట ఉండాలంటే మాత్రం సభ అనుమతి తప్పనిసరి: స్పీకర్
- అంతకుమించి సుప్రీంకోర్టు తీర్పులో సభ జోక్యం చేసుకోదు: స్పీకర్
12:36 July 18
స్పీకర్...
- అధికార, ప్రతిపక్షాలకు చర్చలో సమాన అవకాశాలు ఇస్తామన్న స్పీకర్ రమేశ్ కుమార్
- మాజీ, ప్రస్తుత, భవిష్యత్ సీఎంల మధ్య తాను ఇరుక్కుపోయానంటూ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్య
12:25 July 18
సిద్ధరామయ్య...
- సభ్యుల అనర్హత వేటుకు సంబంధించి నిబంధనలపై ప్రశ్నించిన సిద్ధరామయ్య
- రాజ్యాంగం పదో ఆర్టికల్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందన్న సిద్ధ రామయ్య
- రాజీనామా చేసినా....విప్ ను భేఖాతరు చేసినా సభ్యుల పై అనర్హత వేటు వేయాలనీ కోరిన సిద్ధ రామయ్య
12:11 July 18
సిద్ధరామయ్య...
- సభ్యుల అనర్హత వేటుకు సంబంధించి నిబంధనలపై ప్రశ్నించిన సిద్ధరామయ్య
- రాజ్యాంగం పదో ఆర్టికల్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందన్న సిద్ధ రామయ్య
- రాజీనామా చేసినా....విప్ ను భేఖాతరు చేసినా సభ్యుల పై అనర్హత వేటు వేయాలనీ కోరిన సిద్ధ రామయ్య
11:53 July 18
సభ్యుల వాగ్వాదం...
చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు డీకే శివకుమార్‌కు.. భాజపా సభ్యులకు వాగ్వాదం చోటుచేసుకుంది.
11:47 July 18
సభలో మాట్లాడుతోన్న కుమారస్వామి...
సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపగలనా.. లేదా అన్న దానిపై నేను రాలేదు: కుమారస్వామి
స్పీకర్ పాత్రను కూడా కొంతమంది సభ్యులు ప్రమాదంలో పడేశారు: కుమారస్వామి
ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా: కుమారస్వామి
కర్ణాటక అభివృద్ధికి నేను శాయశక్తులా కృషిచేస్తున్నా: కుమారస్వామి
మా ఆధిక్యాన్ని కచ్చితంగా నిరూపించుకుంటాం: కుమారస్వామి
స్పీకర్ ఎప్పుడూ నిష్పక్షపాతంగానే వ్యవహరించారు: కుమారస్వామి
11:35 July 18
కుమారస్వామి...
విశ్వాస తీర్మానంపై సభలో మాట్లాడుతున్న కుమారస్వామి
సర్కారును కూలగొట్టడానికి ప్రతిపక్షం ఎన్నో పన్నాగాలు పన్నింది: స్వామి
యడ్యూరప్ప ఎందుకు అంత తొందర పడుతున్నారు?: స్వామి
రెబల్ ఎమ్మెల్యేలు నాపై అసత్య ఆరోపణలు చేశారు: స్వామి
ఎటువంటి సవాలుకైనా, చర్చకైనా సిద్ధమే: స్వామి
11:26 July 18
మొదలైన చర్చ...
- కర్ణాటక విధానసభకు చేరుకున్న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు
- ప్రారంభమైన కర్ణాటక విధాన సభ
11:25 July 18
కాసేపట్లో బలపరీక్ష...
- ముందుగా అవిశ్వాస తీర్మానంపై జరగనున్న చర్చ
- చర్చ అనంతరం బలం నిరూపించుకోవాల్సి ఉన్న సంకీర్ణ ప్రభుత్వం
- విధానసభలో మొత్తం సభ్యుల సంఖ్య 224
- రాజీనామాలు సమర్పించిన 16 మంది ఎమ్మెల్యేలు
- రాత్రి రాజీనామా ఉపసంహరించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి
- సంకీర్ణ సర్కారుకే మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపిన రామలింగారెడ్డి
- మిగిలిన ఎమ్మెల్యేల రాజీనామా అంశాన్ని స్పీకర్‌కే వదిలేసిన సుప్రీంకోర్టు
- అసంతృప్త ఎమ్మెల్యేలు బలపరీక్షకు హాజరు విషయంలో స్వేచ్ఛనిచ్చిన సుప్రీంకోర్టు
- బలపరీక్షకు హాజరు కావటం లేదని తెలిపిన అసంతృప్త ఎమ్మెల్యేలు
- అసంతృప్త ఎమ్మెల్యేల గైర్హాజరుతో అసెంబ్లీలో 209కి తగ్గనున్న సీట్ల సంఖ్య
- ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కావల్సిన సభ్యుల సంఖ్య-105
- అసంతృప్తుల రాజీనామాతో 102కు పడిపోయిన సంకీర్ణ సర్కారు బలం
- స్పీకర్‌ది నిర్ణయాత్మక ఓటు మాత్రమే కావటంతో 101 కే పరిమితం కానున్న సంకీర్ణ బలం
- 105 మంది సొంత ఎమ్మెల్యేలతో ధీమాగా ఉన్న కమలదళం
- భాజపాకు మద్దతు తెలిపిన ఇద్దరు స్వతంత్ర శాసనసభ్యులు
- ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో 107కు చేరిన భాజపా బలం
- 105 మంది ఎమ్మెల్యేల బలం లేకుంటే గద్దె దిగనున్న సంకీర్ణ సర్కారు
- 107 మంది ఎమ్మెల్యేలతో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం
10:58 July 18
విధానసభకు కుమారస్వామి...
సీఎం కుమారస్వామి విధానసభకు చేరుకున్నారు. కొద్ది నిమిషాల్లో బలపరీక్షను ఎదుర్కోబోతున్నారు.
10:51 July 18
సెక్షన్ 144...
- విధానసభ పరిసరాల్లో సెక్షన్ 144 విధింపు
- భారీగా బలగాల మోహరింపు
10:47 July 18
కుమారుడు నెగ్గేనా..?
నామినేటెడ్ ఎమ్మెల్యేను మినహాయిస్తే మొత్తం 224 మంది సభ్యులున్న కన్నడ విధానసభలో ప్రభుత్వ మెజార్టీకి 113 మంది ఉంటే సరిపోతుంది. కాంగ్రెస్ 78, జేడీఎస్ 37, బీఎస్పీ ఒకటి, నామినేటెడ్ సభ్యుడితో కలిపి కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ సర్కారుకు 117 మంది మద్దతు ఉన్న సమయంలో 13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఫలితంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 65, జేడీఎస్ వద్ద 34 మంది ఎమ్మెల్యేలున్నారు.
శాసససభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మరో ఇద్దరు స్వతంత్రులు ఎస్ శంకర్, హెచ్ నగేష్ భాజపాకు మద్దతు ప్రకటించారు. తద్వారా భాజపా బలం 107 కు చేరింది. ఈ పరిస్థితిలో రాజీనామాలు చేసి ముంబయిలో మకాం వేసిన 16 మంది రెబల్ ఎమ్మెల్యేలు గురువారం అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభకు వచ్చే ప్రశ్నే లేదని తేల్చిచెప్పినందున కుమారస్వామి ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంలో పడింది.
ఈ 16 మంది సభకు రాకుంటే విధానసభలో సభ్యుల సంఖ్య 208 కి పడిపోతుంది. అప్పుడు ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించాలంటే 105 మంది మద్దతు అవసరం కాగా.... కాంగ్రెస్-జేడీఎస్ బలం సభాపతితో కలిపితే 101 గా ఉంటుంది. నామినేటెడ్ ఎమ్మెల్యేకు కూడా ఓటుహక్కు ఉన్నందున సంకీర్ణ సర్కార్ బలం 102 వద్దే నిలిచిపోతుంది. ఈ పరిస్థితిలో మెజారిటీ సభ్యుల బలం లేనందున కుమార స్వామి ప్రభుత్వం కూలడం ఖాయంగా కనిపిస్తోంది.
10:37 July 18
కొద్ది నిమిషాల్లోనే...
తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న కన్నడ రాజకీయ భవితవ్యం కాసేపట్లో తేలిపోనుంది. కర్ణాటకలో కుమార స్వామి ప్రభుత్వం నిలుస్తుందా?.. లేదా అన్న ఊహాగానాలకు మరికొద్ది నిమిషాల్లో తెరపడనుంది. సభాపతి రమేష్ కుమార్ ఆదేశానుసారం ముఖ్యమంత్రి కుమారస్వామి సభలో బలనిరూపణ చేసుకోనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు విశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. చర్చ పూర్తయిన వెంటనే విధానసభలో ఓటింగ్ జరగనుంది. అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ ప్రభుత్వం బలం వందకు పడిపోయింది. మరోవైపు ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో భాజపా బలం 107 కు చేరింది. ఈ నేపథ్యంలో దాదాపు 13 నెలల కుమారస్వామి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయంగా కనిపిస్తోంది. తాజా పరిస్థితులతో అందరి దృష్టి మరోసారి కర్ణాటక రాజకీయాలపై పడింది.
10:24 July 18
కొద్ది నిమిషాల్లోనే...
తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న కన్నడ రాజకీయ భవితవ్యం కాసేపట్లో తేలిపోనుంది. కర్ణాటకలో కుమార స్వామి ప్రభుత్వం నిలుస్తుందా?.. లేదా అన్న ఊహాగానాలకు మరికొద్ది నిమిషాల్లో తెరపడనుంది. సభాపతి రమేష్ కుమార్ ఆదేశానుసారం ముఖ్యమంత్రి కుమారస్వామి సభలో బలనిరూపణ చేసుకోనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు విశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. చర్చ పూర్తయిన వెంటనే విధానసభలో ఓటింగ్ జరగనుంది. అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ ప్రభుత్వం బలం వందకు పడిపోయింది. మరోవైపు ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో భాజపా బలం 107 కు చేరింది. ఈ నేపథ్యంలో దాదాపు 13 నెలల కుమారస్వామి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయంగా కనిపిస్తోంది. తాజా పరిస్థితులతో అందరి దృష్టి మరోసారి కర్ణాటక రాజకీయాలపై పడింది.