తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయం లైవ్​: భాజపాపై కాంగ్రెస్​ తీవ్ర ఆరోపణలు - jds

'కర్'నాటకీయం సంక్షోభం కొలిక్కివచ్చేనా..?​

By

Published : Jul 9, 2019, 9:46 AM IST

Updated : Jul 9, 2019, 10:28 PM IST

2019-07-09 22:24:41

'భాజపాతో ప్రజస్వామ్యానికి ప్రమాదం'

భాజపాపై కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత గులామ్​ నబీ ఆజాద్​ తీవ్ర విమర్శలు చేశారు. భాజపా చర్యలతో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆరోపించారు. రాష్ట్రపతి- గవర్నర్ల తీరుపై దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. బెంగళూరులో జరిగిన కాంగ్రెస్​ పార్టీ అగ్రనేతల సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై చర్చించారు.

2019-07-09 19:39:36

తిరుగుబాటు ఎమ్మెల్యేలతో చర్చ...

కాంగ్రెస్​ నేత శివకుమార్​ రేపు ముంబయికి వెళ్లనున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో చర్చలు జరపనున్నారు. ఈ చర్చ ఎలాంటి ఫలితాన్నిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

2019-07-09 19:31:29

రేపు గవర్నర్​ వద్దకు భాజపా...

కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 1 గంటకు గవర్నర్​ను కలవడానికి భాజపా నిర్ణయించింది. సమావేశం అనంతరం తదుపరి కార్యచరణ నిర్ణయిస్తామని భాజపా వెల్లడించింది. రేపు విధాన​సౌధ ఎదుట నిరసనలు చేపట్టనుంది.

2019-07-09 16:32:08

రోషన్​ బేగ్​కు షాక్​...

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటలకే కాంగ్రెస్​ బహిష్కృత నేత రోషన్​ బేగ్​కు షాక్​ తగిలింది. ఐఎమ్​ఏ పాంజీ కుంభకోణం కేసులో గురువారం విచారణకు హాజరు కావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(ఎస్​ఐటీ) బేగ్​ను ఆదేశించింది.

ఐఎమ్​ఏ నగల వ్యాపారి మహమ్మద్​ మన్సూర్​ ఖాన్​ భారీ కుంభకోణానికి పాల్పడారు. ప్రస్తుతం ఆయన పారారీలో ఉన్నారు. తన నుంచి బేగ్​ 400 కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను బేగ్​ ఖండించారు.

2019-07-09 15:03:20

'కర్ణాటకీయం'కు ముగింపు దొరికేనా...?

కర్ణాటక రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. కొలిక్కివస్తుందనుకున్న 'సంకీర్ణ సర్కార్​ సంక్షోభం' నేడు స్పీకర్​ చేసిన వ్యాఖ్యలతో మరింత కాలం కొనసాగేలా కనిపిస్తోంది. అసంతృప్తుల్ని బుజ్జగించేందుకు కాంగ్రెస్ చేస్తున్న​ ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించట్లేదు. రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరికొంత మందీ అదే బాటలో పయనించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భాజపా తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 

రాజీనామా బాటలో మరికొందరు...

సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటుతో ఇప్పటికే 14 మంది ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. కాంగ్రెస్​ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రోషన్​ బేగ్​ నేడు రాజీనామా చేశారు. వీరితో మొత్తం సంఖ్య 15కు చేరింది. మరికొంత మంది ఎమ్మెల్యేలు ఇదే బాటలో పయనించనున్నట్లు తెలుస్తోంది. 

మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు రాజీనామా చేసి.. భాజపాకు మద్దతు ప్రకటించారు. ఫలితంగా.. సంకీర్ణ ప్రభుత్వానికి సమస్యలు తప్పేలా లేవు. విధానసభలో కూటమి బలం తగ్గిపోతోంది. 

నేడు ముంబయి, దిల్లీ వెళ్లను: రోషన్​

కాంగ్రెస్​ శాసనసభ్యత్వానికి ఈ రోజు రాజీనామా చేశారు బహిష్కరణకు గురైన రోషన్​ బేగ్​. ఈయన శివాజీనగర్​ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. మిగతా రెబల్స్​లా తాను ముంబయి లేదా దిల్లీ హోటళ్లకు వెళ్లనని మీడియాకు తెలిపారు. 

పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన కారణంతో రోషన్​ను గతంలోనే పార్టీ నుంచి బహిష్కరించింది కాంగ్రెస్​. 

మెజార్టీకి దూరంలో...

కర్ణాటక అసెంబ్లీ స్థానాలు 224.

15 మంది రాజీనామాల్ని స్పీకర్​ ఆమోదిస్తే.. సభలో మిగిలే సభ్యుల సంఖ్య- 209(స్పీకర్​తో కలిపి)

మేజిక్​ నంబరు-105

స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో భాజపా బలం- 107

సంకీర్ణ కూటమి బలం- 102 (కాంగ్రెస్​- 66, జేడీఎస్​- 34, బీఎస్పీ- 1, స్పీకర్​-1)

సమయముంది.. చూద్దాం..

రాజీనామాలపై స్పీకర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తననెవరూ సంప్రదించలేదని.. ఈ అంశంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. దీనికి నిర్ణీత గడువు అంటూ ఏమీ లేదని పేర్కొన్నారు. అనంతరం.. గవర్నర్​ను కలిసిన ఆయన.. రాజీనామాల్లో కొన్ని చెల్లవని చెప్పారు.

"రెబల్​ ఎమ్మెల్యేలు ఎవరూ నన్ను కలవలేదని గవర్నర్​కు సమాచారం అందించా. నేను రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని గవర్నర్​ విశ్వాసం వ్యక్తంచేశారు. 13 రాజీనామాల్లో 8 నిబంధనల ప్రకారం లేవు. ఆ లేఖలు సమర్పించిన వారు నన్ను కలవాలని సూచించా."
            -రమేశ్​ కుమార్​, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్

సిద్ధరామయ్య హెచ్చరిక...

కర్ణాటక సంక్షోభం నేపథ్యంలో నేడు సీఎల్పీ భేటీ అయింది. కాంగ్రెస్​ ముఖ్య నేతలు సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్​ తదితరులు హాజరయ్యారు. అనంతరం.. మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్​ శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య. 

అసంతృప్త ఎమ్మెల్యేలు తిరిగి రాకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. వారిని రాజీనామాలు ఉపసంహరించుకోవాలని కోరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని స్పీకర్​ను కోరనున్నట్లు వెల్లడించారు. 

మోదీ, భాజపాపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. 

"ప్రభుత్వాలను అస్థిరపరచడం భాజపాకు అలవాటుగా మారింది. ఇలా చేయడం అప్రజాస్వామికం. ప్రభుత్వం ఏర్పాటు చేయమని ప్రజలు భాజపాకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. మాకే ఎక్కువ ఓట్లు ఇచ్చారు. జేడీఎస్​, కాంగ్రెస్​కు కలిపి 57శాతానికిపైగా ఓట్లు వచ్చాయి.
ఈసారి రాష్ట్ర భాజపా నేతలు మాత్రమే కాదు... అమిత్​షా, మోదీ వంటి జాతీయ స్థాయి నేతలు ఇందులో భాగస్వాములై ఉన్నారు. వారి ఆదేశాల మేరకే మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి."
        -సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి

భాజపా ప్రయత్నాలు..

కాంగ్రెస్​ బుజ్జగింపులు, హెచ్చరికలు చేస్తుండగా.. భాజపా సమయం కోసం చూస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తోంది. సంకీర్ణ ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజార్టీ లేదని.. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఆందోళనలు చేస్తున్నారు పార్టీ నేతలు. 

స్పీకర్​ రాజీనామాల్ని ఆమోదిస్తే.. బలం నిరూపించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది కమలదళం. 

2019-07-09 14:47:27

స్పీకర్​ సంచలన ప్రకటన

కర్ణాటకంలో కొత్త మలుపు. 13 మంది శాసనసభ్యులు సమర్పించిన రాజీనామాల్లో 8 నిబంధనల ప్రకారం లేవని తెలిపారు స్పీకర్ రమేశ్​ కుమార్. 

"రెబల్​ ఎమ్మెల్యేలు ఎవరూ నన్ను కలవలేదని గవర్నర్​కు సమాచారం అందించా. నేను రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని గవర్నర్​ విశ్వాసం వ్యక్తంచేశారు. 13 రాజీనామాల్లో 8 నిబంధనల ప్రకారం లేవు. ఆ లేఖలు సమర్పించిన వారు నన్ను కలవాలని సూచించా."
            -రమేశ్​ కుమార్​, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్
 

2019-07-09 14:23:20

కూటమిపై ఒత్తిడి పెంచుతున్న భాజపా

ఎమ్మెల్యేల రాజీనామాతో సంక్షోభంలో చిక్కుకున్న కాంగ్రెస్​-జేడీఎస్​ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు భాజపా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కుమారస్వామి మెజార్టీ కోల్పోయారని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ ధార్వాడ్​లో భాజపా కార్యకర్తలు నిరసన చేపట్టారు.

2019-07-09 14:10:03

రాజ్యసభలో దుమారం- సభ రేపటికి వాయిదా

కర్ణాటక వ్యవహారంపై రాజ్యసభలో కాంగ్రెస్​ సభ్యులు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. సభా మధ్యంలోకి దూసుకెళ్లి... అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్య రాజ్యసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్​ ప్రకటించారు.

2019-07-09 13:03:49

రెబల్స్​పై అనర్హత వేటు!

పార్టీని వీడి వెళ్లిన శాసనసభ్యులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎల్పీ నేత సిద్ధరామయ్య హెచ్చరించారు. తిరిగి వచ్చి, రాజీనామా ఉపసంహరించుకోవడమే ఉత్తమ మార్గమని హితవు పలికారు.

"పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డందుకు రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి. వారు భాజపాతో కుమ్మక్కయ్యారు. 
రెబల్​ ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదించరాదని, వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్​ను అభ్యర్థించాలని నిర్ణయించాం. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద రెబల్స్​పై చర్యలు తీసుకోవాలని స్పీకర్​ను కోరుతున్నాం. వారిని అనర్హులుగా ప్రకటించి, రానున్న ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని అభ్యర్థిస్తున్నాం."
        -సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి

 

2019-07-09 12:55:52

మరో ఎమ్మెల్యే రాజీనామా...

కాంగ్రెస్​ ఎమ్మెల్యే రోషన్​ బేగ్​ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్​ కార్యాలయానికి వెళ్లి ఈమేరకు లేఖ సమర్పించారు.

2019-07-09 12:51:01

తిరుగుబాటు ఎమ్మెల్యేల వైఖరిని తప్పుబడుతూ కాంగ్రెస్​ నేతలు బెంగళూరులోని విధాన సౌధలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు.

2019-07-09 12:44:56

కాంగ్రెస్ నేతల నిరసన

కాంగ్రెస్​-జేడీఎస్​  సంకీర్ణ ప్రభుత్వాన్ని పంతనం అంచుల్లోకి నెడుతూ రాజీనామా చేసిన శాసనసభ్యులకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరికలు చేశారు. వెనక్కి తిరిగి రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.

2019-07-09 12:42:37

సిద్ధరామయ్య హెచ్చరికలు

కర్ణాటక రాజకీయ పరిస్థితుల్ని లోక్​సభలోనూ ప్రస్తావించింది కాంగ్రెస్​. భాజపా తీరును కాంగ్రెస్​ పక్షనేత అధిర్ రంజన్​ చౌదరి తప్పుబట్టారు. ఫిరాయింపుల రాజకీయానికి పూర్తిగా ముగింపు పలకాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కర్ణాటక వ్యవహారానికి నిరసగా లోక్​సభ నుంచి కాంగ్రెస్​ సభ్యులంతా వాకౌట్​ చేస్తున్నట్లు ప్రకటించారు.

2019-07-09 12:32:05

లోక్​సభ నుంచి కాంగ్రెస్ సభ్యుల వాకౌట్

కర్ణాటక రాజకీయ సంక్షోభంతో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో మరోసారి వాయిదా వేశారు. సభ తిరిగి 2 గంటలకు ప్రారంభం కానుంది. 

2019-07-09 12:11:52

కర్ణాటక సంక్షోభంతో రాజ్యసభలో గందరగోళం

కర్ణాటక రాజకీయ సంక్షోభంతో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో మరోసారి వాయిదా వేశారు. సభ తిరిగి 2 గంటలకు ప్రారంభం కానుంది. 

2019-07-09 11:54:21

గవర్నర్​తో కుమారస్వామి భేటీ..?

సీఎల్పీ భేటీకి ఎమ్మెల్యే గైర్హాజరు

శాసనసభా పక్ష సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్​ గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాలతోనే హాజరు కాలేకపోతున్నానని పార్టీకి లేఖ రాశారు. 

2019-07-09 11:24:30

కర్​'నాటకం'పై రాజ్యసభలో దుమారం

కర్ణాటక పరిణామాల వెనక భాజపా హస్తం ఉందని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఆరోపించారు. తాజా పరిణామాలతో తమకేమీ సంబంధం లేదని రాజ్​నాథ్ సింగ్ వెల్లడించారని, భాజపా కన్నడ నేత యడ్యూరప్ప ఇదే రకమైన స్పందనను వ్యక్తం చేశారని.. కానీ తమ మంత్రులను లాక్కునేందుకు వ్యక్తిగత సహాయకుడిని పంపిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు.

2019-07-09 11:18:09

రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటా: స్పీకర్

తాజా రాజకీయ పరిణామాలపై కర్ణాటక శాసనసభ స్పీకర్ కేఆర్ సురేశ్ కుమార్ స్పందించారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలెవరూ తన సమయం కోరలేదని వెల్లడించారు. ఎవరైనా తనను కలవాలనుకుంటే కార్యాలయంలో అందుబాటులో ఉంటానని తెలిపారు.

2019-07-09 11:14:10

'భాజపాదే పాపం'

అసెంబ్లీ హాల్​లో సీఎల్పీ సమావేశమైంది. కాంగ్రెస్​ శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్​ వ్యవహారాల బాధ్యుడు.. కేసీ వేణుగోపాల్​.. ఇతర కాంగ్రెస్​ ఎమ్మెల్యేలందరూ పాల్గొన్నారు. 

2019-07-09 11:08:25

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్​ రమేశ్​ కుమార్​... విధానసభకు చేరుకున్నారు. 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోనున్నారు.  ముందుగా  వీరికి నోటీసులిచ్చి... కీలక అంశాలపై ప్రశ్నించనున్నారు. నేరుగా తనకే ఎందుకు రాజీనామా పత్రాలు సమర్పించలేదని? స్వచ్ఛందంగా ఇచ్చారా? లేదా? అని తెలుసుకోనున్నారు.

2019-07-09 10:40:37

సీఎల్పీ భేటీ...

రాజకీయ సంక్షోభం పరిస్థితుల నేపథ్యంలో.. కాంగ్రెస్​ శాసనసభాపక్ష సమావేశం మరికాసేపట్లో జరగనుంది. నేతలందరూ ఒక్కొక్కరుగా అసెంబ్లీ హాల్​కు చేరుకుంటున్నారు. కాంగ్రెస్​ నేత.. డీకే శివకుమార్​ దిల్లీ వెళ్లినందున సీఎల్పీ భేటీకి హాజరయ్యే అవకాశాలు కనిపించట్లేదు. కీలకమైన ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

2019-07-09 10:13:44

స్పీకర్​ నిర్ణయంపై ఉత్కంఠ...

రాజకీయ సంక్షోభ పరిస్థితుల్లో.. అవకాశం వస్తే అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది భాజపా. కొందరు సీనియర్లు.. కర్ణాటక భాజపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నివాసానికి చేరుకుంటున్నారు. 

2019-07-09 09:55:37

అసెంబ్లీ హాల్​లో సీఎల్పీ భేటీ...

కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్తు దాదాపు నేడే తేలనుంది. రాజీనామాలపై స్పీకర్​ నిర్ణయంతో రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

14 మంది అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్​ ఆమోదిస్తే.. భాజపా అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

వీటన్నింటి నడుమ నేడు సీఎల్పీ సమావేశం కానుంది. ముంబయిలో ఉన్న మరికొందరు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు నేడు స్పీకర్​ను కలిసి రాజీనామాలు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. 

2019-07-09 09:43:14

భాజపా నేతలు యడ్యూరప్ప ఇంటికి...

కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్తు దాదాపు నేడే తేలనుంది. రాజీనామాలపై స్పీకర్​ నిర్ణయంతో రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

14 మంది అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్​ ఆమోదిస్తే.. భాజపా అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

వీటన్నింటి నడుమ నేడు సీఎల్పీ సమావేశం కానుంది. ముంబయిలో ఉన్న మరికొందరు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు నేడు స్పీకర్​ను కలిసి రాజీనామాలు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. 

2019-07-09 09:14:40

కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్తు దాదాపు నేడే తేలనుంది. రాజీనామాలపై స్పీకర్​ నిర్ణయంతో రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

14 మంది అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్​ ఆమోదిస్తే.. భాజపా అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

వీటన్నింటి నడుమ నేడు సీఎల్పీ సమావేశం కానుంది. ముంబయిలో ఉన్న మరికొందరు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు నేడు స్పీకర్​ను కలిసి రాజీనామాలు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. 

Last Updated : Jul 9, 2019, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details