కర్ణాటక వైద్యశాఖ మంత్రి కె.సుధాకర్ కుటుంబాన్ని కరోనా కలవరానికి గురిచేస్తోంది. మంత్రి తండ్రి కేశవ రెడ్డికి కరోనా సోకినట్టు నిర్థరణ అయిన ఒకరోజ వ్యవధిలోనే.. సుధాకర్ భార్య, కూతురికి పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
"మా కుటుంబ సభ్యులు చేయించుకున్న కరోనా పరీక్షల ఫలితాలు వచ్చాయి. దురదృష్టవశాత్తు నా భార్య, కూతురికి వైరస్ నిర్థరణ అయ్యింది. ప్రస్తుతం వాళ్లు చికిత్స పొందుతున్నారు. నా ఇద్దరి కొడుకులకు నెగెటివ్‌గా తేలింది. మా కోసం ప్రార్థిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు."
-- సుధాకర్, కర్ణాటక వైద్యశాఖ మంత్రి.