తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కన్నడనాట సంక్షోభం: ముంబయిలో హైడ్రామా

ముంబయిలో హైడ్రామా నడిచింది. హోటల్లో ఉన్న కర్ణాటక ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లిన కన్నడ మంత్రి డీకే శివకుమార్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోనికి వెళ్లేందుకు అనుమతించాలని హోటల్ ముందు బైఠాయించిన శివకుమార్​ను బలవంతంగా లాక్కెల్లారు పోలీసులు.

కన్నడ మంత్రిని అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు

By

Published : Jul 10, 2019, 5:08 PM IST

కన్నడ మంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్​ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక ఎమ్మెల్యేలు ఉన్న హోటల్​ ఎదుట బైఠాయించిన ఆయనను బలవంతంగా లాకెళ్లి కస్టడీకి తరలించారు.

శివకుమార్​ను కలిసేందుకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి మిలింద్​ దేవరా, మహారాష్ట్ర మాజీ మంత్రి ససీం ఖాన్​లనూ అదుపులోకి తీసుకుట్లు అధికారులు తెలిపారు. వీరిని కలినా విశ్వవిద్యాలయ విశ్రాంతి గృహానికి తరలించారు.

టీవి ఛానల్​కు ఇంటర్వ్యూ ఇస్తున్న శివకుమార్​ను​ లాక్కెళ్లినంత పని చేశారు పోలీసులు.

అసమ్మతి ఎమ్మెల్యేలు ఉన్న హోటల్లోకి ప్రవేశించేందుకు బుధవారం ఉదయం యత్నించిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్​ను మహారాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. తమకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తన మిత్రులను కలవకుండా ముంబయిని వీడేది లేదని హోటల్​ వద్ద బైఠాయించారు డీకే. అనంతరం ఈ పరిణామాలు జరిగాయి.

కన్నడ మంత్రిని అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు

ఇదీ చూడండి: కర్ణాటకీయం లైవ్​: స్పీడ్​ పోస్ట్​లో రాజీనామాలు!

ABOUT THE AUTHOR

...view details