కర్ణాటక పర్యటక శాఖ మంత్రి సీటీ రవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఆదివారం కొవిడ్-19 సోకినట్లు స్వయంగా ట్విట్టర్లో పేర్కొన్నారు రవి. అయితే ఆయన భార్య సహా.. సన్నిహితులకు మాత్రం పరీక్షల్లో నెగటివ్‌గా తేలింది.
'ఆదివారం వచ్చిన కరోనా ఫలితాల్లో నాకు వైరస్ సోకినట్లు తేలగా.. అదృష్టవశాత్తూ నా భార్య, తోటి సిబ్బందికి కొవిడ్ లేదని నిర్ధరణ అయింది. అయినప్పటికీ నేను బాగానే ఉన్నాను.'