క్షణానికో మలుపు తిరిగే కన్నడ రాజకీయంలో తాజాగా స్పీకర్ రమేశ్ కుమార్ రాజీనామా చేశారు. యడ్యూరప్ప బలపరీక్షలో గెలిచిన వెంటనే తన నిర్ణయాన్ని సభలో ప్రకటించారు.
"నేను సభాపతి బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. రాజీనామా చేస్తున్నాను. స్పీకర్ పదవికి ఎలాంటి మచ్చ రాకుండా నా శక్తి మేర పని చేశాను." - రమేశ్ కుమార్, సభాపతి
రమేశ్ కుమార్... కాంగ్రెస్-జేడీఎస్ హయాంలో స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక... తాను ఆ పదవిలో కొనసాగడం భావ్యంకాదని ఆయన అనుకున్నారని సమాచారం. కూటమి ప్రభుత్వ పతనానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడం వల్ల తన బాధ్యత పూర్తయినట్లు రమేశ్ భావించారని తెలుస్తోంది. రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కు అందజేశారు.