కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి కొత్త మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. విశ్వాస పరీక్షపై ఓటింగ్ జరగకుండానే సభ వాయిదా పడిన సమయంలో కర్ణాటక గవర్నర్ వాజుభాయి వాలా మరో బాంబు పేల్చారు.
శాసనసభలో బల నిరూపణకు కర్ణాటక ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటల లోపు సభ విశ్వాసాన్ని పొందాలని ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి లేఖ రాశారు వాజుభాయి.
ఓటింగ్‌కు యడ్డీ డిమాండ్
విశ్వాస పరీక్షపై ఓటింగ్ జరపకుండా కర్ణాటక శాసనసభను శుక్రవారానికి వాయిదా వేయటంపై ప్రతిపక్ష నేత యడ్యూరప్ప మండిపడ్డారు. తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం కుమారస్వామి ప్రజాస్వామ్య విలువలను సైతం తుంగలో తొక్కారని ఆరోపించారు.
"మేము అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశాం. కానీ ముఖ్యమంత్రి బలపరీక్ష ఎదుర్కొనేందుకు విముఖత చూపారు. దీనిని బట్టి.... ముఖ్యమంత్రి సభ విశ్వాసాన్ని కోల్పోయారని స్పష్టం అయ్యింది. అందరికీ తెలుసు సభలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి బలం 98 మాత్రమే....భాజపా బలం 105గా ఉంది. విశ్వాస తీర్మానంపై గవర్నర్ ఆదేశాలను అమలు చేయడంలో స్పీకర్ సైతం విఫలమయ్యారు. తీర్మానంపై ఓటింగ్ జరిగే వరకు మా పోరాటం కొనసాగిస్తాం."
-యడ్యూరప్ప, కర్ణాటక భాజపా అధ్యక్షుడు
రేపు సుప్రీంకోర్టుకు సీఎం, స్పీకర్!