తెలంగాణ

telangana

By

Published : Dec 19, 2020, 7:55 PM IST

ETV Bharat / bharat

భూలోక స్వర్గాన్ని తలపించే అద్దాల మేడ

అద్దాల మేడ అనగానే అందమైన అనుభూతినిచ్చే ఓ చక్కని ప్రదేశంగా నిలుస్తుంది. అందులోనే ఓ సుందరమైన తోట ఉంటే ఇక దాని ప్రత్యేకతే వేరు. ఇలాంటి సౌకర్యాలతోనే విశేషంగా ఆకట్టుకుంటోంది కర్ణాటకలో ఇటీవల నిర్మించిన ఓ గ్లాస్​ హౌస్​. అందులో అడుగు పెట్టగానే స్వర్గలోకాన్ని తలపిస్తోందంటూ కితాబిస్తున్నారు సందర్శకులు. మరి ఇంతటి రమణీయమైన ఆ గ్లాస్​ హౌస్​ ప్రత్యేకతలేంటో చూసేయండి..

Karnataka Davanagere glass house: The biggest glass house of the country
భూలోక స్వర్గాన్ని తలపించే అందమైన అద్దాల మేడ

భూలోక స్వర్గాన్ని తలపించే అందమైన అద్దాల మేడ

కర్ణాటకలోని ప్రసిద్ధ పర్యటక ప్రదేశం హంపి. దీని తరువాత అంతటి ఖ్యాతిని సొంతం చేసుకునే దిశగా.. పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఓ గ్లాస్​ హౌస్​. దేశంలోనే అతిపెద్ద అద్దాల గృహంగా పేరుగాంచిన ఈ నిర్మాణాన్ని చూసేందుకు పెద్దఎత్తున తరలివస్తున్నారు సందర్శకులు. దీన్ని వీక్షించేందుకు విదేశీయులూ క్యూ కట్టడం విశేషం.

భూలోక స్వర్గంలా..

పర్యటకులను మైమరిపించే ఈ అద్భుతమైన అద్దాల గృహం.. దావణగెరెలోని నాలుగో నంబర్​ జాతీయ రహదారిపై ఉంది. ప్రముఖ కుందవాడ సరస్సు సమీపంలో నిర్మితమైన ఈ అందమైన అద్దాల మేడ.. అలా కాలు మోపగానే ఇలా మైమరిచిపోయేలా ఆకర్షిస్తోందట. ఒక్కమాటలో చెప్పాలంటే భూలోక స్వర్గాన్ని తలపించేలా ఉందంటూ కొనియాడుతున్నారు దీన్ని చూసిన పర్యటకులు.

"నేను ఐర్లాండ్​లో ఉంటున్నాను. నా మిత్రుడి పెళ్లి కోసం ఇక్కడకు వచ్చాను. వారి సాయంతోనే ఈ ప్రదేశాన్ని చూసేందుకు వచ్చా. ఇందులోని తోటలు చాలా అందంగా ఉన్నాయి. ప్రశాంతమైన ఈ వాతావరణం.. ధ్యానం చేసేందుకు ఉత్తమ ప్రదేశంగా అనిపిస్తోంది."

- అమోఘ్​, ఐర్లాండ్​లో భారత సంతతి వ్యక్తి

"మేమీ అందమైన ప్రదేశాన్ని చూసేందుకు కొప్పల్​(కర్ణాటక) నుంచి ఇక్కడకు వచ్చాం. ఈ గ్లాస్​ హౌస్​ లోపలికి ప్రవేశించగానే స్వర్గాన్ని తలపిస్తోంది. ఇందులోని వాతావరణం, చుట్టూ నాటిన మొక్కలు పర్యటకులను మైమరిచిపోయేలా చేస్తున్నాయి."

- ఉషా,పర్యటకురాలు, కొప్పల్ జిల్లా, కర్ణాటక

గ్లాస్​ హౌస్​.. జాతీయ రహదారికి అతి చేరువలో ఉండటం వల్ల ఎక్కువ మంది సందర్శకులు విశ్రాంతి కోసం వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొప్పల్, హుబ్లి-ధార్వాడ్, హవేరి, దావణగెరె, బెల్గాం, షిమోగా ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో ఈ గ్లాస్​ హౌస్​​ను చూసేందుకు తరలివస్తున్నారట. థాయిలాండ్​, ఐర్లాండ్​లో నివసిస్తున్న ప్రవాస భారతీయులూ దీన్ని సందర్శించేందుకు వస్తున్నారంటే.. ఈ అద్దాల గృహం గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు.

ఇవీ ప్రత్యేకతలు..

ఈ గ్లాస్​ హౌస్​లో ఉద్యాన సమాచార కేంద్రం ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించేందుకు ఇందులోనే ప్రత్యేక ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఇక ఈ గ్లాస్​ హౌస్​ తోటలో అలంకరించిన అందమైన విదేశీ మొక్కలు, చెట్లు.. చూపరులను తమవైపునకు తిప్పుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాత్రి పూట రంగురంగుల్లో ప్రకాశించేలా ప్రత్యేక లైట్లను అమర్చారు.

నిర్మాణం జరిగిందిలా..

రూ. 30కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్లాస్​ హౌస్​ పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 108, 68, 18 మీటర్లు. దీని నిర్మాణ పనులు.. 2014లో ప్రారంభమై గతేడాదే ముగిశాయి.

ఇదీ చదవండి:ఔరా! ట్రాక్టర్​నే కుంచె చేసి.. అద్భుతమైన బొమ్మ గీసి..

ABOUT THE AUTHOR

...view details