తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయం: 'రాజీనామాలు, ఫిరాయింపులు ఒక్కటే' - cogress

అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కర్ణాటక యువజన కాంగ్రెస్​ నాయకుడు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేల రాజీనామాలు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయని, వారంతా ప్రలోభాలకు గురయ్యారని పిటిషన్​లో పేర్కొనారు.

సుప్రీంకోర్టు

By

Published : Jul 12, 2019, 12:35 PM IST

10 మంది కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు కర్ణాటక యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ చాకో. వాళ్ల రాజీనామాలు పార్టీకి నష్టం కల్గించేలా ఉన్నాయని, ఫిరాయింపుల తరహాలో రాజీనామాల వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. భారీ మొత్తంలో ధనం, ఇతర స్వార్థ ప్రయోజనాలకు ఆశపడే వారు రాజీనామా చేశారని పిటిషన్​లో పేర్కొన్నారు చాకో.

చాకో వాదనలు వినేందుకు సీజేఐ జస్టిస్ రంజన్​ గొగొయ్​ నేతృత్వంలోని ధర్మాసనం అనుమతించింది.

ABOUT THE AUTHOR

...view details