కర్ణాటక విధానసభలో విశ్వాస పరీక్షపై రెండోరోజూ ఉత్కంఠ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1:30లోపు బలపరీక్ష నిర్వహించకుండా గవర్నర్ సూచనలు బేఖాతరు చేశారు సీఎం కుమార స్వామి.
సీఎంకు మరోసారి లేఖ రాశారు కర్ణాటక గవర్నర్. ఇవాళే బలపరీక్ష పూర్తి చేయాలని విధానసౌధకు సందేశం పంపారు. బలపరీక్ష నిర్వహించి, మెజారిటీ నిరూపించుకోవాలని సీఎంకు సూచించారు.
సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్
17వ తేదీనాటి ఉత్తర్వుల్లో విప్‌పై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావు. సభకు 15 మంది రెబల్ ఎమ్మెల్యేల హాజరుపై బలవంతం చేయలేమన్న ఆదేశాలపై స్పష్టత కోరారు. విప్ జారీ అనేది రాజకీయ పార్టీకి ఉన్న హక్కని పిటిషన్‌లో పేర్కొన్నారు దినేష్. 10వ షెడ్యూల్ ఉల్లంఘన ఎమ్మెల్యేలకు వర్తిస్తుందన్నారు.
ఇదీ చూడండి: కర్ణాటకీయం లైవ్:బలపరీక్షకు గవర్నర్ మరో డెడ్లైన్