కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప రాజకీయ సలహాదారు, బంధువు ఎన్ఆర్ సంతోశ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిద్రమాత్రలు తీసుకొని బలవన్మరణానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు తెలియరాలేదు. బెంగళూరు డాలర్స్ కాలనీలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో ఉన్న సంతోశ్‌ను.. కుటుంబ సభ్యులు గుర్తించి స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలిసిన యడియూరప్ప.. సంతోశ్‌ను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లారు. సంతోశ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు సీఎం.