తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటక కేబినెట్​లో కొత్తగా 10 మంది - YADIYURAPPA CABINET

కర్ణాటక కేబినెట్​ విస్తరణలో భాగంగా ఈరోజు 10మంది ఎమ్మెల్యేలు రాజ్​భవన్​లో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం 34మందికి అవకాశం ఉండగా.. ప్రస్తుతం 28మంది ఉన్నారు.

Karnataka CM expands Cabinet, inducts 10 Ministers
10మందితో కర్ణాటక కేబినెట్​ విస్తరణ

By

Published : Feb 6, 2020, 1:01 PM IST

Updated : Feb 29, 2020, 9:40 AM IST

కర్ణాటక కేబినెట్​లో కొత్తగా 10 మంది

కర్ణాటక మంత్రివర్గాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప విస్తరించారు. బెంగళూరు రాజ్​ భవన్​లో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు 10మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు ఆ రాష్ట్ర గవర్నర్​ వాజుభాయ్​ వాలా.

ఎస్​ టీ సోమశేఖర్​, రమేశ్​ జార్కిహోలి, ఆనంద్​ సింగ్​, కే సుధాకర్​, బైరతి బసవరాజ్​, ఏ శివరామ్​ హెబ్బర్​, బీ.సీ పాటిల్​, కే గోపాలయ్య, కే.సీ నారాయణ గౌడ, శ్రీమత్​ బాలాసాహెబ్​ పాటిల్​లు ఈ రోజు మంత్రివర్గంలో చేరారు.

వీరందరూ కాంగ్రెస్​, జేడీఎస్​ నుంచి భాజపాలో చేరి.. గత డిసెంబర్​లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన వారే.

మొత్తం 34... కానీ

కర్ణాటక మంత్రివర్గంలో మొత్తం 34మందికి అవకాశం ఉంది. తాజాగా ప్రమాస్వీకారం చేసిన 10మంది ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 28మంది యడియూరప్ప కేబినెట్​లో ఉన్నారు.

Last Updated : Feb 29, 2020, 9:40 AM IST

ABOUT THE AUTHOR

...view details