కర్ణాటక ప్రభుత్వం గురువారం రాష్ట్రవ్యాప్తంగా 'మాస్క్డే'ను నిర్వహించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేదిశగా.. మాస్క్‌లు, శానిటైజర్, సబ్బుతో చేతుల్ని శుభ్రపరచుకోవడం, భౌతిక దూరం పాటించే విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం.
కరోనాపై అవగాహనే లక్ష్యంగా ఘనంగా 'మాస్క్డే'
కరోనాపై అవగాహన కల్పిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 'మాస్క్ డే'ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మాస్క్‌లు, శానిటైజర్, భౌతిక దూరం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ నిర్వహించారు.
కర్ణాటకలో ఘనంగా 'మాస్క్డే'.. పాల్గొన్న ప్రముఖులు
కొవిడ్-19ను నివారించడంలో మాస్క్ ప్రాముఖ్యత తెలియజేస్తూ.. ముఖ్యమంత్రి బీఎస్ యడూయూరప్ప 'మాస్క్ డే' కార్యక్రమం చేపట్టారు. ఈ అవగాహన ర్యాలీలో భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, శాండల్‌వుడ్ స్టార్స్, కేబినెట్ మంత్రులు సహా మరికొందరు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:గురువారం మాస్క్ డే- కరోనాపై అవగాహనే లక్ష్యం