కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తన మంత్రిమండలిని విస్తరించనున్నారు. కొత్తగా ఏడుగురు సభ్యులకు చోటు కల్పిస్తున్నట్లు మంగళవారం సూచనప్రాయంగా చెప్పారు. కొత్త కేబినెట్‌ను బుధవారం సాయంత్రం ప్రకటిస్తానని, వెంటనే నూతన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు.
అయితే నూతన కేబినెట్ మంత్రులపై మీడియాలో వస్తున్న వార్తలకు, తాను ప్రకటించబోయే దానికి వాస్తవంగా పొంతన ఉండబోదని యడియూరప్ప తెలిపారు. ప్రస్తుత మంత్రిమండలిలో ఎరికైనా ఉద్వాసన పలుకుతారా? అనే విషయంపై ఆయన ఉత్కంఠ కొనసాగిస్తున్నారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ జనరల్ సెక్రెటరీ ఇంఛార్జ్ అరుణ్ సింగ్‌లను ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు.