తెలంగాణ

telangana

నేడే కన్నడ 'ఉప' ఫలితాలు.. తేలనున్న యడియూరప్ప భవితవ్యం

కర్ణాటకలో భాజపా ప్రభుత్వ భవితవ్యం నేడు తేలనుంది. ఉపఎన్నికలు జరిగిన 15 అసెంబ్లీ స్థానాల్లో ఈరోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నం లోగా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అధికారం నిలబెట్టుకోవాలంటే భాజపా 6 స్థానాల్లో విజయం సాధించాల్సిన నేపథ్యంలో... గెలుపు తమదే అని కమలనాథులు ధీమాగా ఉన్నారు.

By

Published : Dec 9, 2019, 5:16 AM IST

Published : Dec 9, 2019, 5:16 AM IST

Updated : Dec 9, 2019, 7:36 AM IST

karnataka bypolls
నేడే కన్నడ 'ఉప' ఫలితాలు.. తేలనున్న యడియూరప్ప భవితవ్యం

నేడే కన్నడ 'ఉప' ఫలితాలు.. తేలనున్న యడియూరప్ప భవితవ్యం

కర్ణాటకలో భాజపా ప్రభుత్వ భవితవ్యం ఈరోజు తేలనుంది. ఉపఎన్నికలు జరిగిన 15 అసెంబ్లీ స్థానాలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్​ నేపథ్యంలో.. అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఆరు స్థానాల్లో గెలుపు అనివార్యం...

డిసెంబర్ 5న 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 67.91 శాతం పోలింగ్ నమోదైంది. నేడు వెలువడే ఫలితాల అనంతరం భాజపా తిరిగి అధికారం నిలబెట్టుకోవాలంటే 15 స్థానాల్లో కనీసం ఆరు గెలవాలి.

భాజపాదే గెలుపు!

ఇప్పటికే భాజపా గెలుపు ఖాయమని ఎగ్జిట్‌ పోల్ సర్వేలు స్పష్టం చేశాయి. 9 నుంచి 12 స్థానాలు భాజపా కైవసం చేసుకుంటుందని స్థానిక వార్తా సంస్థల సర్వేలు ప్రకటించాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

విజయం కోసం పార్టీల నేతల పూజలు..

నేడు ఫలితాలు వెలువడనున్న తరుణంలో విజయం తమకే దక్కాలని ఆయా పార్టీల నేతలు ఆలయాలు, మఠాలను ఆదివారం సందర్శించారు. ముఖ్యమంత్రి యడియూరప్ప దర్మస్థలలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంజునాథుని ఆశీర్వాదాలు కోరారు.

మాజీ ప్రధాని, జేడీఎస్​ వ్యవస్థాపకుడు దేవె గౌడ.. షిరిడిలోని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్నారు.

ఎవరికెంత బలం

225 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థులతో కలిపి భాజపాకు 105 మంది సభ్యుల మద్దతు ఉంది. కాంగ్రెస్​కు 66, జేడీఎస్​కు 34 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారు. వీరు కాకుండా స్పీకర్​, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే, బీఎస్​పీ శాసనసభ్యుడు ఉన్నారు.

ఎమ్మెల్యేలపై అనర్హత వేటుతో ఎన్నికలు అనివార్యం...

కాంగ్రెస్-జేడీఎస్​ కూటమికి చెందిన 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ అనర్హత వేటు వేసిన తర్వాత కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం జులైలో పతనమైంది. స్పీకర్ చర్యతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 225 నుంచి 208 తగ్గింది. దీంతో ఆధిక్యానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 105కు చేరింది భాజపా.

105 మంది ఎమ్మెల్యేలు ఉన్న యడియూరప్ప నేతృత్వంలో భాజపా... బలపరీక్షలో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15 సీట్లకు డిసెంబర్ 5న ఎన్నికలు నిర్వహించగా..​ హైకోర్టు కేసుల కారణంగా మిగిలిన రెండు సీట్లకు ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​ను వరించిన 'కోయిర్ కేరళ-2019' అవార్డు

Last Updated : Dec 9, 2019, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details