తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయం: స్వామికి యడ్డీ 'బస్తీ మే సవాల్'

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్​ డీ కుమారస్వామి తక్షణమే రాజీనామా చేయాలని బీఎస్​ యడ్యూరప్ప డిమాండ్​ చేశారు.  కాంగ్రెస్-జేడీఎస్​ కూటమికి మెజారిటీ లేదని ఆరోపించారు.  సోమవారమే బలపరీక్ష నిర్వహించాలని సీఎంకు సవాల్ విసిరారు కర్ణాటక భాజపా అధ్యక్షుడు.

రాజీనామానా, బలనిరూపణా తేల్చుకోండి: యడ్యూరప్ప

By

Published : Jul 14, 2019, 4:51 PM IST

కర్ణాటకలో కాంగ్రెస్​-జేడీస్​ కూటమి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని ఆరోపించారు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల సీఎంకు గౌరవం ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. లేదా అసెంబ్లీలో సోమవారం బలనిరూపణకు సిద్ధమవ్వాలని సవాలు విసిరారు.

రేపు జరగబోయే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో సీఎం కుమారస్వామితో ఇదే విషయంపై చర్చించబోతున్నట్లు స్పష్టం చేశారు యడ్యూరప్ప.

మీడియాతో మాట్లాడుతున్న యడ్యూరప్ప

" 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇద్దరు స్వతంత్ర శాసనసభ్యులు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని భాజపాకు మద్దతు తెలిపారు. మెజారిటీ లేనందున సీఎం తక్షణమే రాజీనామా చేయాలి. లేదా బలపరీక్ష నిర్వహించాలి."
-బీఎస్ యడ్యూరప్ప, కర్ణాటక భాజపా అధ్యక్షుడు

ఫలించని కాంగ్రెస్​ బుజ్జగింపులు.

అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలు ఉపసంహరింపజేసేలా కాంగ్రెస్​-జేడీఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యే రామలింగా రెడ్డితో మంతనాలు జరిపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన మాత్రం ఎవరికీ అందుబాటులో లేకుండా మౌనంగా ఉన్నట్లు సమాచారం. రామలింగా రెడ్డి ముంబయి వెళ్లలేదని, పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

శనివారం రామలింగా రెడ్డితో భాజపా నేతలు చర్చలు జరిపారు.

నాగరాజు ఝలక్​

కర్ణాటక అధికార కూటమికి అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు ఝలక్​ ఇచ్చారు. శనివారం కూటమి అగ్రనేతలతో భేటీ అనంతరం పార్టీలో కొనసాగుతానని తెలిపిన ఆయన.. మళ్లీ మనసు మార్చుకున్నారు. రెబల్​ ఎమ్మెల్యేల శిబిరంలో కలిసేందుకు ముంబయి వెళ్లారు.
నాగరాజు నిర్ణయంతో అసంతృప్తుల శిబిరంలో ఎమ్మెల్యే సుధాకర్​ కూడా చేరే అవకాశం ఉంది.


ఇదీ చూడండి: కర్ణాటకీయం: కూటమికి ఝలక్- ముంబయికి నాగరా
జు

ABOUT THE AUTHOR

...view details