దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మరోసారి లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. కర్ణాటకలోని బెంగళూరు సహా అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయల్లో లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు తెలిపాయి అక్కడి ప్రభుత్వాలు. కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతుండగా.. ఆ తేదీలను మరికొద్ది రోజులపాటు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశాయి.
కర్ణాటకలో మళ్లీ..
బెంగళూరు నగరంలో జులై 14 నుంచి వారం రోజులపాటు పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లో ఉంటుదని ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే నిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం బీఎస్ యడియూరప్ప తెలిపారు.
అసోంలో పొడిగింపు..
అసోంలోని గువహటిలో కొనసాగుతోన్న లాక్‌డౌన్‌ను మరో వారం పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సర్కార్ తెలిపింది. ఈ నిబంధనలు జులై 12 నుంచి అమల్లోకి రానున్నాయని ప్రకటించింది. రాష్ట్రంలో 14 రోజుల లాక్డౌన్ ఆదివారంతో ముగియనుండగా.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కృష్ణ తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో..
అరుణాచల్ ప్రదేశ్‌లో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. జులై 20న ఉదయం 5 గంటల వరకు రాజధాని ఇటానగర్ ప్రాంతంలో లాక్డౌన్ అమల్లో ఉంటుందని సీఎస్ నరేశ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి పెమా ఖండు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఉత్తరాఖండ్‌లో 3 రోజులు..
ఉత్తరాఖండ్- ఉధమ్‌సింగ్ నగర్‌లోని కాశీపుర్‌లో శుక్రవారం ఒక్కరోజే 41 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడ శనివారం నుంచి మూడు రోజుల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లోకి రానుంది.
కశ్మీర్లో అలా..