తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యువతి గొంతు కోసి.. ఆపై ఆత్మహత్యాయత్నం - సుశాంత్

కర్ణాటక మంగళూరులో ఓ యువతి గొంతు కోసి ఆపై తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు ఓ యువకుడు. ప్రస్తుతం ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రేమ విఫలమవటమే దాడికి కారణంగా అనుమానిస్తున్నారు పోలీసులు.

యువతి గొంతు కోసి.. ఆపై ఆత్మహత్యాయత్నం

By

Published : Jun 29, 2019, 4:42 PM IST

యువతి గొంతు కోసి.. ఆపై ఆత్మహత్యాయత్నం

కర్ణాటక మంగళూరు సమీపంలోని ఉల్లాల్​ ప్రాంతంలో దారుణ ఘటన జరిగింది. యువతి గొంతు కోసి ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. స్థానికులు ఆపే ప్రయత్నం చేయగా వారిని కత్తితో బెదిరిస్తూ.. యువతిపై పలుమార్లు దాడి చేశాడు. తానూ మెడపై కత్తితో కోసుకొని ఉన్మాదిలా ప్రవర్తించాడు.

స్థానికులు అంబులెన్స్​లో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇరువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడికి పాల్పడిన యువకుడిని సుశాంత్ (22) ​గా గుర్తించారు పోలీసులు. ప్రేమ వైఫల్యమే దాడికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి: వైరల్​: విమానాన్ని ఢీకొట్టిన 'పక్షిరాజు'

ABOUT THE AUTHOR

...view details