తెలంగాణ

telangana

ETV Bharat / bharat

1008 మంది బాలికలకు కన్యాపూజ- 'లిమ్కా' బుక్​లో చోటు

హిమాచల్​ ప్రదేశ్​ మండి జిల్లాలో 1008 మంది బాలికలకు  'కన్యాపూజ'  నిర్వహించింది  అక్కడి జిల్లా యంత్రాంగం.  ఈ కార్యక్రమం 'లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డ్స్'​లో చోటు సంపాదించింది. మహిళా శక్తి చాటి చెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అధికారులు  తెలిపారు.

1008 మంది బాలికలకు కన్యాపూజ- 'లిమ్కా' బుక్​లో చోటు

By

Published : Nov 21, 2019, 10:23 PM IST

Updated : Nov 22, 2019, 2:15 AM IST

1008 మంది బాలికలకు కన్యాపూజ- 'లిమ్కా' బుక్​లో చోటు

మహిళా శక్తిని తెలిజేసేందుకు హిమచల్​ప్రదేశ్​ మండి జిల్లాలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఒకేసారి 1008 మంది బాలికలకు 'కన్యాపూజ' నిర్వహించింది అక్కడి జిల్లా యంత్రాంగం. 'బేటీ బచావో- బేటీ పడావో' నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం 'లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డ్స్'​లో చోటు సంపాదించింది.

సమాజంలో లింగ సమానత్వం, విద్య, భద్రత, ఆరోగ్యం, గౌరవం, ఆత్మగౌరవం బాలికల హక్కులపై అవగాహన కల్పించటం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జిల్లాలో 'బేటీ బటావో-బేటీ పడావో' ప్రచారాన్ని, 'బాలిక గౌరవ్​ ఉద్యన్​ యోజన'గా ప్రారంభించినట్లు వెల్లడించారు అధికారులు. బాలికల భద్రత, పర్యావరణ రక్షణ... బాలిక గౌరవ్​ ఉద్యన్​ యోజన ముఖ్య లక్ష్యాలుగా ప్రచారం చేస్తున్నారు. మహిళా సంఘాలు, పంచాయతీ రాజ్​, ఇతర సామాజిక సంస్థలు ఇందుకు సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలిపారు.

ఇదే ఏడాది 'బేటీ బచావో బేటీ పడావో' ప్రచారాన్ని విస్తృతం చేసినందుకు ఈ జిల్లా యంత్రాంగం రెండు జాతీయ అవార్డులు అందుకుంది.

"మేము చేసే ప్రతి కార్యక్రమంలో 'బేటీ బచావో- బేటీ పడావో' అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. లింగ భేదం అనేది ఇంకా ఉంది. ప్రజల్లో అవగాహన పెంచాలి."

-రిగ్వేద్​ ఠాక్రే, జిల్లా కలెక్టర్​.

ఇదీ చూడండ : లైవ్ వీడియో: క్షణంలో జింకను పట్టేసిన కొండచిలువ

Last Updated : Nov 22, 2019, 2:15 AM IST

ABOUT THE AUTHOR

...view details