తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అండర్​ వరల్డ్​ డాన్​ల ఫొటోలతో స్టాంప్​లు - stamps of kanpur Post office

అండర్​ వరల్డ్​ డాన్​ చోటా రాజన్​, గ్యాంగ్​స్టర్​ మున్నా భజ్​రంగీ ఫొటోలతో పోస్టల్​ స్టాంప్​లు ముద్రించింది ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ తపాలా కార్యాలయం. దీనిపై ఆగ్రహించిన కాన్పూర్​ పోస్టల్​ డిపార్ట్​మెంట్​ వెంటనే దర్యాప్తునకు ఆదేశాలిచ్చింది.

Kanpur post office releases stamps of criminals probe ordered
అండర్​ వరల్డ్​ డాన్​ల ఫొటోలతో పోస్టల్​ స్టాంప్​లు

By

Published : Dec 29, 2020, 11:53 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​లోని ఓ తపాలా కార్యాలయంలో పెద్ద పొరపాటు జరిగింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా... ఏకంగా అండర్​ వరల్డ్​ డాన్లు చోటా రాజన్​, మున్నా భజ్​రంగీ ఫొటోలున్న పోస్టల్​ స్టాంప్​లు ముద్రితమయ్యాయి.

గ్యాంగ్​స్టర్​ మున్నా ఫొటోతో 12 పోస్టల్​ స్టాంప్​లు

కేంద్రం అమలు చేసిన 'మై స్టాంప్' పథకం ద్వారా ఇండియా పోస్ట్ కొందరికి వ్యక్తిగత పోస్టల్​ స్టాంప్​లు అందిస్తుంది. ఇలా ఓ వ్యక్తి... అండర్ వరల్డ్​ డాన్ చోటా రాజన్​, గ్యాంగ్​స్టర్​ మున్నా ఫోటోలతో మొత్తం 24 స్టాంపులు తయారు చేయించుకున్నాడు. వీటిని అచ్చు వేసినందుకు పోస్టు ఆఫీసుకు రూ. 600 చెల్లించాడు.

చోటా రాజన్​ ఫొటోతో ఉన్న స్టాంప్

ఈ ఘటనపై స్పందించిన కాన్పూర్​ పోస్టు మాస్టర్ జనరల్ వినోద్​ కుమార్​ వర్మ... అధికారుల తప్పిదం వల్లే ఇలా జరిగిందని అన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిని త్వరలోనే కనిపెడతామని తెలిపారు.

ఇదీ చదవండి:దేశంలో ఆరుగురికి కొత్త రకం వైరస్

ABOUT THE AUTHOR

...view details