తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం.. ఆపై అవయవాల తొలగింపు - crimes against minors in up

ఉత్తర్​ప్రదేశ్​లో అత్యంత అమానవీయ ఘటన వెలుగు చూసింది. మూఢనమ్మాకాలతో ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి ప్రాణం తీశారు ఇద్దరు యువకులు. ఆపై ఆమె శరీరాన్ని కోసి కాలేయాన్ని బయటకు తీశారు. ఫతేహ్​పుర్​లో మరో దారుణం జరిగింది. అసోధర్​ ప్రాంతానికి చెందిన ఇద్దరు దళిత అక్కాచెల్లెల్ని చంపి... ఊరి చివరన ఉండే చెరువులో పడేశారు దుండగులు.

Kanpur: A six-year-old girl was allegedly raped and brutally murdered on Diwali night by two men in Kanpur's Bhadras village.
ఆ ఘటనలు అమానుషం.. అమానవీయం..!

By

Published : Nov 17, 2020, 10:36 AM IST

Updated : Nov 17, 2020, 12:07 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​లోని భద్రాస్​ గ్రామంలో దారుణం జరిగింది. దీపావళి రోజు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశారు ఇద్దరు కిరాతకులు. ఆపై ఆమె శరీరం నుంచి అవయవాలు తొలగించారు. బాలిక కాలేయం తింటే పిల్లలు పుడతారు అనే మూఢనమ్మకంతో సమీప బంధువే... సుపారీ ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

పిల్లలు కావాలని...

బాధితురాలి బంధువువైన పరశురామ్​కి వివాహం జరిగి 21 ఏళ్లు దాటింది. ఇప్పటికీ పిల్లలు కలగలేదు. దీంతో డాక్టర్లను ఆశ్రయించాల్సింది పోయి.. క్షుద్రపూజలు చేసే వారి వద్దకు వెళ్లారు. బాలిక కాలేయం తింటే పిల్లలు కలిగే అవకాశం ఉందని మాంత్రికుడు చెప్పాడు. దీంతో గ్రామంలోని అంకున్​, వీరన్​లకు సుపారీ ఇచ్చి చిన్నారి కాలేయం తీసుకురమ్మని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

రూ. 1500 సుపారీ..

చిన్నారి ప్రాణం తీయడానికి నిందితులు తీసుకున్న మొత్తం రూ.1500. దీపావళి నాడు చిన్నారికి బాణసంచా ఇప్పిస్తానని చెప్పి తీసుకువెళ్లారు. తర్వాత అత్యాచారం చేసి, బాలిక ప్రాణాలు తీశారు. శరీరం నుంచి అవయవాలు తొలగించి పరుశురామ్​కు అప్పచెప్పినట్లు పోలీసులు తెలిపారు.

మరో ఘటన...

ఫతేహ్​పుర్​లో ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లను చంపి ఊరి చివరన చెరువులో పడేశారు దుండగులు. మృతుల కాళ్లపై కత్తితో దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కూరాగాయలు తేవడానికి ఇంటి నుంచి వెళ్లిన ఇరువురిని అత్యాచారం చేయబోయి చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి: ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్టు

Last Updated : Nov 17, 2020, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details