తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంచీపురం ఉత్సవాల్లో అపశ్రుతి.. నలుగురు మృతి - తొక్కిసలాట

తమిళనాడు కాంచీపురం అత్తివరదరాజస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆసుపత్రికి తరలిస్తుండగా నలుగురు భక్తులు మరణించారు.

కాంచీపురం

By

Published : Jul 18, 2019, 6:23 PM IST

తమిళనాడు కాంచీపురం అత్తివరదరాజస్వామి ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు అపస్మారకస్థితిలోకి వెళ్లారు. ఆస్పత్రికి తరలిస్తుండగా నలుగురు భక్తులు మృతి చెందారు. మరణించిన వారిలో గుంటూరు జిల్లాకు చెందిన మహిళ నారాయణమ్మ ఉన్నారు. కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో మరో ఐదుగురు భక్తులు చికిత్స పొందుతున్నారు.

40 ఏళ్లకు ఒకసారి..

అతి ప్రాచీనమైన వరదార్ యొక్క పవిత్ర విగ్రహాన్ని 40 సంవత్సరాల తరువాత ఆలయ చెరువు నుండి బయటకు తీసినప్పటి నుండి గత కొన్ని రోజులుగా ఈ ఆలయం భారీగా భక్త జనంతో కిక్కిరిసిపోతుంది. బుధవారం ఆలయం వద్ద పోలీసుల లాఠీఛార్జి వల్ల ఇద్దరు మరణించారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి.

కంచిలో విష్ణుమూర్తి విగ్రహాన్ని 40 ఏళ్లకి ఒకసారి చెరువులో నుంచి బయటకు తీస్తారు. ఈ సందర్భంగా దర్శనానికి లక్షలమంది భక్తులు వస్తారు. ఎందుకంటే మరలా జీవితంలో 40 ఏళ్లకు గానీ చూడలేరు.

ఇదీ చూడండి: శిక్ష మొదలైన 10 రోజులకే 'దోశల రాజు' మృతి

ABOUT THE AUTHOR

...view details