తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు కమల్​నాథ్​

ప్రచార కర్త హోదాను ఈసీ తొలగించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్. తన పిటిషన్​పై అత్యవసర విచారణ జరపాలని అభ్యర్థించారు.

By

Published : Oct 31, 2020, 5:43 PM IST

SC-KAMAL NATH
కమల్​నాథ్​

స్టార్ క్యాంపెయినర్ హోదాను తొలగిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని కోరారు.

మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కమల్‌నాథ్ స్టార్‌ క్యాంపెయినర్ హోదాను తొలగిస్తూ శుక్రవారం ఈసీ నిర్ణయం తీసుకుంది.

వివాదాస్పద వ్యాఖ్యలు..

ప్రచారంలో భాగంగా.. భాజపా మహిళా అభ్యర్థిపై కమల్‌నాథ్ చేసిన 'ఐటెం' వ్యాఖ్యలు సహా సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో నైతిక, హుందాతనంతో కూడిన ప్రవర్తనను కమల్​నాథ్ ఉల్లంఘించారన్న ఎన్నికల సంఘం.. ప్రచారకర్త హోదాను తొలగించింది. దీనిపై కమల్​నాథ్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

స్టార్ క్యాంపెయినర్ల ప్రచార ఖర్చును సదరు పార్టీ భరించాల్సి ఉంటుంది. మిగతా ప్రచారకర్తల ఖర్చును సంబంధిత నియోజకవర్గ అభ్యర్థి భరించాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:'ఉచిత టీకా హామీ.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదు'

ABOUT THE AUTHOR

...view details