'మూడో ప్రధాని అభ్యర్థి ఎంతో అవసరం' - Kamal Hassan
ఎన్డీయే, యూపీఏ కూటమియేతర థర్డ్‌ఫ్రంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు 'మక్కల్ నీది మయ్యమ్' పార్టీ అధినేత కమల్ హాసన్. దేశ ప్రజలు థర్డ్‌ఫ్రంట్ గురించి ఆలోచించడం మొదలు పెట్టారని వ్యాఖ్యానించారు. దేశానికి కాంగ్రెస్, భాజపాయేతర మూడో ప్రధాని అభ్యర్థి ఎంతో అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కమల్.
థర్డ్‌ఫ్రంట్‌పై 'మక్కల్ నీది మయ్యమ్' పార్టీ అధినేత కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు థర్డ్‌ఫ్రంట్ గురించి ఆలోచిస్తున్నారని అభిప్రాయపడ్డారు. కచ్చితంగా థర్డ్‌ఫ్రంట్ ఏర్పడే అవకాశముందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ అంశంపై కొన్ని పార్టీల నేతలు చర్చలు జరిపినట్లు స్పష్టం చేశారు. దేశానికి ఎన్డీయే, యూపీఏ కూటమియేతర ప్రధాని అభ్యర్థి ఎంతో అవసరమన్నారు కమల్. అనంతరం కోయంబత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.