తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిమాచల్​ గవర్నర్​గా కల్​రాజ్- గుజరాత్​కు దేవవ్రత్ - దేవవ్రత్

భాజపా సీనియర్‌ నేత కల్​రాజ్​ మిశ్రా హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ను గుజరాత్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

హిమాచల్​ గవర్నర్​గా కల్రాజ్, గుజరాత్​కు దేవవ్రత్

By

Published : Jul 15, 2019, 3:31 PM IST

హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​గా భాజపా సీనియర్​ నేత కల్​రాజ్​​ మిశ్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర గవర్నర్​గా విధులు నిర్వర్తిస్తున్న ఆచార్య దేవవ్రత్​ను గుజరాత్​కు బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్​ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇరువురు గవర్నర్లు వారివారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది.

మోదీ 1.0 ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశారు కల్​రాజ్‌మిశ్రా. 2017లో ఆయన వయస్సు 75ఏళ్లు పూర్తికావటం వల్ల మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు. 75ఏళ్లు నిండినవారు ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న భాజపా నిర్ణయం మేరకు ఆయన ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు.

2015 నుంచి ఆచార్య దేవవ్రత్‌ హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గుజరాత్‌ గవర్నర్‌ ఓపీ కోహ్లీ ఇవాళ పదవీ విరమణ చేసిన నేపథ్యంలో దేవవ్రత్​ను గుజరాత్​కు బదిలీ చేశారు.

ఇదీ చూడండి: కర్ణాటకీయం: గురువారం స్వామికి బలపరీక్ష

ABOUT THE AUTHOR

...view details