తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పండుగ' రంగులతో... 'విందు'​ నల్లకోడితో...

ఈ కోళ్లు చూశారా... వీటిని కడక్​నాథ్​ కోళ్లుగా పిలుస్తారు. మధ్యప్రదేశ్​లో మాత్రమే పెరిగే అరుదైన జాతికి చెందినవి.. ఈ కోళ్లను బిహార్​లోని ఓ రైతు పెంచుతున్నాడు. హోలీ పండగను పురస్కరించుకుని ఈ అరుదైన జాతి కోళ్లకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.

పండుగ రంగులతో... విందు నల్లకోడితో...

By

Published : Mar 21, 2019, 5:57 AM IST

Updated : Mar 21, 2019, 8:36 AM IST

పండుగ రంగులతో... విందు నల్లకోడితో...
కోళ్లలో రకరకాల జాతులు ఉంటాయి. వాటిలో కొన్నింటికి రుచి నుంచి ధర వరకు ఎన్నో ప్రత్యేకతలుంటాయి. అందులో ఒక ప్రత్యేక జాతే ఈ 'కడక్​నాథ్​ కోడి.' మధ్యప్రదేశ్​కు చెందిన ఈ అరుదైన రకం కోళ్లను బిహార్​ రోహ్​తాస్​లోని తిలాతూ నివాసి కుమార్​ ప్రేమ్​చంద్ అనే రైతు పెంచుతున్నాడు.

మధ్యప్రదేశ్​లో తప్ప మరెక్కడా పెరగని ఈ కోడిని ఓ రైతు ప్రత్యేకంగా పెంచుతున్నాడు ప్రేమ్​చంద్​. కడక్​నాథ్​ కోళ్లను పెంచడంలో అతడికున్న ఆసక్తి అక్కడితో ఆగిపోలేదు. కోడి పిల్లల్ని యంత్రాల సహాయంతో ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు.

నలుపే ప్రత్యేకం..

ధరతోపాటు పోషకాల్లోనూ ఈ కోడి ప్రత్యేకమే. అందుకే ప్రేమ్​చంద్​కు దీనిపై అమితాసక్తి. కడక్​నాథ్​ కోడి నలుపు రంగులో ఉంటుంది. ఈకల నుంచి మాంసం వరకు అంతా నలుపే. ఈ కోడిలో ఏమాత్రం కొవ్వు ఉండదు. ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. రుచి అత్యద్భుతం. అందుకే దీనికి అంత ధరమరి.!

వంటకాల్లోనూ ప్రత్యేకమే...

కడక్​నాథ్​ కోడితో వివిధ ప్రాంతాల్లో పలు రకాల వంటకాలు తయారుచేస్తారు. కొన్ని ప్రాంతాల్లో రోస్ట్ చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో మసాలా దట్టించి ఓ మృదువైన వస్త్రంలో చుడతారు. ఆ వస్త్రంపై పిండిముద్ద పెట్టి మసాలా బయటికిపోకుండా చూస్తారు. అనంతరం ఓవెన్​లో ఉంచి వేడి చేస్తారు. ఇక నోరూరించే కడక్​నాథ్ కోడి మాంసం... మీ ముందుంటుంది.

ధరలు ఆకాశంలో...

మార్కెట్లో దేశవాళీ కోడి ధర 200 నుంచి 300 వరకు పలుకుతుంది. కానీ కడక్​నాథ్ కోడికున్న డిమాండ్ వల్ల దీని ధర కొండెక్కి కూర్చుంది. ఈ కోడి ధర కిలో రూ.700 నుంచి 800 వరకు ఉంటుంది.

ఉపాధి కల్పనలోనూ ముందంజ

కడక్​నాథ్​ కోళ్ల పెంపకం తనకు లాభసాటిగా ఉందని ప్రేమ్​చంద్ తెలిపాడు. తక్కువ ఖర్చుతో అధిక లాభాల్ని ఆర్జిస్తూ గ్రామంలోని వారికీ ఉపాధి కల్పిస్తున్నాడు.

ఈ కోడి రంగు నలుపు. రెక్కలు నలుపు, కళ్లు నలుపు. ఈ కోడి మొత్తం నల్లగానే ఉంటుంది. ఈ కోడి జాతిని వృద్ధి చేయాలనే ఇక్కడకు తీసుకువచ్చాను. దీని పేరు కడక్​నాథ్​. అందరూ దీన్ని ఆ పేరుతోనే పిలుస్తారు. మీరు దీని గురించి అంతర్జాలంలో వెతకొచ్చు. ఈ కోడి మాంసం రుచి బావుంటుంది. దీనిలో చాలా ప్రొటీన్లు ఉంటాయి. ప్రస్తుతం దీని ధర కేజీ. రూ.700 నుంచి 800 ఉంది.

-ప్రేమ్​చంద్​, కోళ్ల పెంపకందారు

గ్రామంలోని వారికి ప్రేమ్​చంద్​ అభిరుచి వల్ల ఉపాధి లభిస్తోన్న కారణంగా ఊరంతా ప్రేమ్​చంద్​కు ఫిదా అయిపోయారు.

Last Updated : Mar 21, 2019, 8:36 AM IST

ABOUT THE AUTHOR

...view details