భారత అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది కె.కె.వేణుగోపాల్‌ను పునర్నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏజీ మూడేళ్ల పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. దీనితో కేంద్రం మరో ఏడాది పాటు ఆయనను ఏజీగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
వేణుగోపాల్‌ను మరో మూడేళ్లపాటు ఏజీగా కొనసాగించడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినా... వయోభారం దృష్ట్యా ఏడాది కాలం మాత్రమే కొనసాగుతానని ఆయన తెలిపారు.
కె.కె.వేణుగోపాల్ భారత అటార్నీ జనరల్‌గా పునర్నియమకం కావడంపై హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. 2020 జులై 1 నుంచి సంవత్సరం పాటు విధులు నిర్వహించనున్నారు వేణుగోపాల్. మాజీ అటార్ని జనరల్ ముకుల్ రోహత్గి స్థానంలో 2017 జూన్ 30న వేణుగోపాల్ పదవీ బాధ్యతలు చేపట్టారు.