తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓటమికి బాధ్యత వహిస్తూ సింధియా రాజీనామా - congress

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు జ్యోతిరాదిత్య సింధియా. ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడి పదవికి మిలింద్​ దేవరా కూడా రాజీనామా సమర్పించారు.

సింధియా

By

Published : Jul 7, 2019, 5:24 PM IST

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి పదవికి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి సమర్పించారు.

"ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. అందుకు బాధ్యతగా నా రాజీనామా పత్రాన్ని రాహుల్​గాంధీకి సమర్పించాను. నాపై నమ్మకం ఉంచి బాధ్యతలను అప్పగించినందుకు రాహుల్​కు కృతజ్ఞతలు."

-జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ నేత

ముంబయిలో మిలింద్​...

ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడి పదవికి మిలింద్ దేవరా రాజీనామా చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'కర్​నాటకం'లో కాంగ్రెస్​ ఆఖరి ప్రయత్నాలు

ABOUT THE AUTHOR

...view details