భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా - madhya pradesh
ఆసుపత్రిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా
13:44 June 09
ఆసుపత్రిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా
మాజీ ఎంపీ, భాజపా రాజ్యసభ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఆయన కరోనా లక్షణాలతో దిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేరారు. 3 వైద్య బృందాలు సింధియాను పర్యవేక్షిస్తున్నాయి. ఆయన తల్లికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.
సింధియా సోమవారం రాత్రే ఆసుపత్రిలో చేరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సింధియా త్వరలోనే కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆయన సన్నిహితులు చెప్పారు.
Last Updated : Jun 9, 2020, 5:23 PM IST