తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తొలి లోక్​పాల్​గా​ జస్టిస్ చంద్ర​ ఘోష్​ - దిలీప్​ బి భోసలే

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్​​ దేశ తొలి లోక్​పాల్​గా నియమితులయ్యారు. వీరిని నియమిస్తూ రాష్ట్రపతి భవన్​ ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. లోక్​పాల్​ ఎంపిక కమిటీ ఈ నియామకాలు చేపట్టింది. ​

తొలి లోక్​పాల్​గా​ జస్టిస్​ ఘోష్​

By

Published : Mar 20, 2019, 5:56 AM IST

Updated : Mar 20, 2019, 7:23 AM IST

తొలి లోక్​పాల్​గా​ జస్టిస్​ ఘోష్​
భారతదేశ ప్రథమ లోక్​పాల్​గా సుప్రీంకోర్టు​ మాజీ న్యాయమూర్తి జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్​ను​ నియమిస్తూ రాష్ట్రపతి భవన్​ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని ఎంపిక కమిటీ లోక్​పాల్​గా ఆయన​ పేరును ఎంపిక చేసింది. దీనికి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఆమోదం తెలిపారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి వీరి నియామకాలు అమలులోకి వస్తాయని అధికారిక ప్రకటన పేర్కొంది. సుప్రీంకోర్టు​ న్యాయమూర్తిగా 2017లో పదవీ విరమణ చేసిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్​ ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుడుగా కొనసాగుతున్నారు.

లోక్​పాల్ జ్యుడీషియల్ సభ్యులుగా జస్టిస్​ దిలీప్​ బి భోసలే, జస్టిస్​ ప్రదీప్​ కుమార్ మొహంతి​, జస్టిస్​ అభిలాష కుమారి, జస్టిస్ అజయ్​ కుమార్​ త్రిపాఠి నియమితులయ్యారు. నాన్​ జ్యుడీషియల్​ సభ్యులుగా దినేష్​ కుమార్​ జైన్​, అర్చనా రామసుందరం, మహేందర్​ సింగ్, ఇంద్రజీత్ ప్రసాద్ గౌతమ్​లను ఎంపిక చేశారు.

సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని నేతృత్వంలోని లోక్​పాల్ ఎంపిక కమిటీ తాజా నియామకాలు చేపట్టింది. అయితే ఈ సమావేశంలో లోక్​సభ సభాపతి​ పాల్గొనగా, కాంగ్రెస్​ నేత, లోక్​సభ ఎంపిక కమిటీలో ఒక సభ్యుడైన మల్లికార్జున ఖర్గే పాల్గొనలేదు.

అంబుడ్స్​మన్​

ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లోని అవినీతి కేసులను పరిశీలించడానికి కేంద్రంలో లోక్​పాల్​, రాష్ట్రాల్లో లోకాయుక్తలను నియమించాలని 2013లోనే చట్టం రూపొందించారు. నిబంధనల ప్రకారం లోక్​పాల్​ వ్యవస్థలో ఒక ఛైర్ పర్సన్​, గరిష్ఠంగా ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. వీరిలో కనీసం నలుగురు న్యాయ సభ్యులు ఉండాలి.

Last Updated : Mar 20, 2019, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details