తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజకీయంలో రాహుల్​ గాంధీ బాలుడే: మాలిక్​

ఆర్టికల్​ 370పై కాంగ్రెస్​ వైఖరిని తెలపకుంటే ప్రజలే సరైన బుద్ధి చెబుతారని జమ్ముకశ్మీర్​ గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​ ఎద్దేవా చేశారు. రాహుల్​ గాంధీ బాలుడిగా ప్రవర్తించారని ఎద్దేవా చేశారు. కశ్మీర్​ ప్రజల క్షేమం కోసమే ఆంక్షలు విధించామని, క్రమ క్రమంగా సడలిస్తున్నామన్నారు.

రాజకీయంలో రాహుల్​ గాంధీ బాలుడే: మాలిక్​

By

Published : Aug 29, 2019, 5:10 AM IST

Updated : Sep 28, 2019, 4:42 PM IST

రాజకీయంలో రాహుల్​ గాంధీ బాలుడే: మాలిక్​

కాంగ్రెస్​, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జమ్ముకశ్మీర్​ గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​. ఆర్టికల్​ 370పై తమ వైఖరి ఏమిటో కాంగ్రెస్ ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతోందని ఎద్దేవా చేశారు. లోక్​సభలో కాంగ్రెస్​ పక్షనేత అధిర్​ రంజన్​ చౌదరి కశ్మీర్​ అంశాన్ని ఐరాసకు సంబంధం ఉన్నట్లు పేర్కొన్నప్పుడు రాహుల్ నుంచి స్పందన లేదని గుర్తు చేశారు.

" దేశంలోని గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాహుల్​ గాంధీ. అందుకే ఆయన గురించి మాట్లాడాలనుకోవట్లేదు. కానీ రాహుల్​ 'రాజకీయ బాలుడి'గా ప్రవర్తించారు. దాని పర్యవసానంగానే ఐక్యరాజ్య సమితికి పాకిస్థాన్​ రాసిన లేఖలో రాహుల్​ పేరు ప్రస్తావనకు వచ్చింది. రానున్న ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ పార్టీపై ప్రత్యర్థులు ఏమీ చెప్పక్కర్లేదు. కేవలం కాంగ్రెస్​ నాయకులు ఆర్టికల్​ 370కి మద్దతుదారులని చెబితే చాలు.. ప్రజలే తీర్పు చెబుతారు."

- సత్యపాల్​ మాలిక్​, జమ్ముకశ్మీర్​ గవర్నర్​.

కశ్మీరీల సంక్షేమం కోసమే...

కశ్మీరీల ప్రాణాలకు నష్టం కలగకూడదన్న కారణంతోనే ఆంక్షలు విధించినట్లు తెలిపారు సత్యపాల్‌. మొబైల్​​, అంతర్జాలాన్ని తీవ్రవాదుల సమీకరణ, శిక్షణకు ఎక్కువగా ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. ఇది కశ్మీర్​ ప్రజలకు వ్యతిరేకంగా ఉపయోగించిన ఒక రకమైన ఆయుధం కావటం వల్ల నిలిపివేసినట్లు చెప్పారు. క్రమ క్రమంగా తిరిగి పునరుద్ధరిస్తామన్నారు.

జమ్ముకశ్మీర్‌ ప్రజల సంస్కృతి, గుర్తింపునకు తాము కట్టుబడి ఉన్నామన్నారు మాలిక్​. రాబోయే 3 నెలల్లో 50వేల ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. త్వరలో జమ్ముకశ్మీర్‌కు సంబంధించి కేంద్రం అతిపెద్ద నిర్ణయం తీసుకోబోతోందని వెల్లడించారు.

రాజకీయంగా మేలు...

జమ్ముకశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా, ఫరూక్​ అబ్దుల్లా వంటి నేతల నిర్బంధం గురించి విలేకరులు ప్రశ్నించగా.. ‘వారి గురించి బాధపడొద్దన్నారు గవర్నర్​. అది వారి రాజకీయ భవిష్యత్తుకు పనికొస్తుందన్నారు. జైలుకెళ్లిన వారే లీడర్లు అవుతారని... ఎంత ఎక్కువ కాలం జైలులో ఉంటే అంత ఎక్కువగా ఎన్నికల్లో లబ్ధి పొందుతారని తెలిపారు. తాను కూడా 30 సార్లు జైలుకెళ్లినట్లు గుర్తు చేసుకున్నారు.

ఇదీ చూడండి: 'రాహుల్ వ్యాఖ్యల ఆధారంగానే పాక్ ఫిర్యాదు'

Last Updated : Sep 28, 2019, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details