తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సంఝౌతా'లో 12మందే - india

సంఝౌతా ఎక్స్​ప్రెస్​లో 12 మంది మాత్రమే ప్రయాణించారు. బాలాకోట్​లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయిసేన చేసిన దాడుల తర్వాత తొలిసారి సంఝౌతా ఎక్స్​ప్రెస్ దిల్లీ నుంచి అటారీ బయలుదేరింది.

'సంఝౌతా'లో 12మంది ప్రయాణికులే

By

Published : Mar 4, 2019, 8:42 AM IST

బాలాకోట్​లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన దాడుల అనంతరం నిలిచిపోయిన సంఝౌతా ఎక్స్​ప్రెస్ సేవలు ఆదివారం తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు లేక బోగీలన్నీ వెలవెలబోయాయి. స్లీపర్​ క్లాస్ బోగీల్లో 10 మంది, ఏసీ కోచ్​లో ప్రయాణించేందుకు ఇద్దరు టికెట్లను బుక్ చేసుకున్నారు. వీరంతా పాకిస్థాన్​కు చెందిన వారే. వారు మాత్రమే ప్రయాణించారు.

భద్రతా కారణాల దృష్ట్యా డాగ్​ స్క్వాడ్​తో రైలులో ముమ్మర తనిఖీలు నిర్వహించారు భద్రతా సిబ్బంది.

సంఝౌతా చివరిసారి అటారీ వెళ్లినప్పుడు 27 మంది ప్రయాణించారు. వారిలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details