తెలంగాణ

telangana

By

Published : Feb 2, 2020, 12:26 PM IST

Updated : Feb 28, 2020, 9:15 PM IST

ETV Bharat / bharat

ఔరా! ఆమె చేతులు అద్భుతాన్ని చేశాయి

ప్లాస్టిక్​ వాడకం, చెత్త నిర్వహణపై అనేక వార్తలు వింటూనే ఉన్నాం. ఇదే తరహాలో పనికిరాని ప్లాస్టిక్​ వ్యర్థాలతో ఉపయోగకరమైన వస్తువుల్ని తయారు చేస్తున్నారు ఓ ఉపాధ్యాయురాలు. వాడి పారేసే వస్తువులకు అద్భుతమైన రూపాన్నిస్తూ తన హస్తకళా నైపుణ్యంతో విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నారామె. కాగితాలు, నూలుదారాలు, బాటిళ్లతో అందమైన వస్తువుల్ని తయారుచేస్తూ... ఔరా! అనిపిస్తున్నారు.

Juniada teacher makes wonder in waste materials
ఔరా! ఆమె చేతులు అద్భుతాన్ని చేశాయి

ఔరా! ఆమె చేతులు అద్భుతాన్ని చేశాయి

పాధ్యాయులు తాము బోధించే అంశాలనే కాకుండా ఇతర విషయాలపైనా విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. కేరళ కన్నూర్​లోని శ్రీకందాపురంనకు చెందిన జునైదా ఇదే కోవకు చెందినవారు. ఎంఏఎల్​పీ పాఠశాలలో కంప్యూటర్​ టీచర్​గా పని చేస్తున్న జునైదా.. తాను నేర్చుకున్న హస్తకళా విద్యను పిల్లలకు బోధిస్తుంటారు.

కాగితం, దారం, బాటిళ్ల సాయంతోనే...

మన నిత్య జీవితంలో చాలా వస్తువుల్ని ఇలా వాడి అలా పారేస్తుంటాం. అలాంటివాటితో అందమైన వస్తువులను తయారు చేస్తుంటారు జునైదా. వార్తా పత్రికలు, నూలు దారాలు, లక్క, బాటిల్​ మొదలైన వాటితో ఎన్నో ఉపయుక్తమైన వస్తువులను తయారుచేస్తారు. రంగుల కాగితాలు, దారాల సాయంతో అనేక వస్తువుల్ని రూపొందిస్తారు. ఇలా ఆమె చేతుల్లోకి వెళ్లిన దేని నుంచైనా అద్భుతం ఆవిష్కృతమవ్వాల్సిందే. అంతలా అవి చూపరులను ఆకట్టుకుంటాయి. జునైదా తయారుచేసిన కాగితపు పుష్పాలు, పక్షి గూళ్లు నిజమైన వాటిని తలదన్నెలా ఉంటాయి.

'నేను ఎంఏఎల్​పీ పాఠశాలలో కంప్యూటర్​ టీచర్​గా పనిచేస్తున్నాను. కాగితం, దారాలు, బాటిళ్లు వంటి వస్తువులతో ఇవన్నీ తయారుచేశాను. ఈ తయారీలో పిల్లలకు వీలైనంత సాయం చేస్తుంటాను.'
- జునైదా, ఉపాధ్యాయురాలు

ఈ ఉపాధ్యాయురాలు... తన హస్తకళా నైపుణ్యాన్ని ఇతరులకు పంచాలన్న ఆకాంక్షతో.. ప్రతి శనివారం విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తుంటారు.

ఇదీ చదవండి:చీమలు గీసిన రూపం.. 'చిండీ మాత' ఆలయం!

Last Updated : Feb 28, 2020, 9:15 PM IST

ABOUT THE AUTHOR

...view details