తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వర నమూనాలపై జడ్జీలు ఆదేశాలు ఇవ్వొచ్చు: సుప్రీం - జడ్జీ

క్రిమినల్​ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి స్వర నమూనాలను ఇచ్చే విధంగా న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేయవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 142 కింద ప్రత్యేక అధికారాలు కట్టబెడుతున్నట్లు పేర్కొంది.

స్వర నమూనాలపై జడ్జీలు ఆదేశాలు ఇవ్వొచ్చు: సుప్రీం

By

Published : Aug 2, 2019, 3:09 PM IST

క్రిమినల్​ కేసుల్లో విచారణపై కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు దర్యాప్తు సంస్థలకు స్వర నమూనాలు ఇచ్చే విధంగా న్యాయమూర్తులు ఆదేశాలు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది.

స్వర నమూనాల అంశంపై న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేసేలా క్రిమినల్​ ప్రొసిజర్​ కోడ్​లో ఎలాంటి నిబంధన లేదని పేర్కొంది. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్​ 142 కింద న్యాయమూర్తులకు ప్రత్యేక అధికారాలు కట్టబెడుతున్నట్లు జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ

ABOUT THE AUTHOR

...view details