తెలంగాణ

telangana

By

Published : Dec 7, 2019, 5:00 PM IST

Updated : Dec 7, 2019, 8:34 PM IST

ETV Bharat / bharat

న్యాయం ప్రతీకారంగా మారకూడదు: జస్టిస్​ బోబ్డే

న్యాయప్రక్రియ ప్రతీకార రూపంలో ఉంటే దాని సహజ స్వభావాన్ని కోల్పోతుందన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే. గతేడాది నలుగురు సుప్రీం కోర్టు సీనియర్​ న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం సొంత తప్పును సరిదిద్దుకోవడమే అని సీజేఐ పేర్కొన్నారు.

judges-presser-last-year-nothing-more-than-self-correcting-measure-cji
న్యాయం ప్రతీకారంగా మారకూడదు: జస్టిస్​ బోబ్డే

న్యాయం ప్రతీకారంగా మారకూడదు: జస్టిస్​ బోబ్డే

దిశ హత్యాచార ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. తక్షణ న్యాయం సాధ్యపడదని.. అదే విధంగా న్యాయం ప్రతీకార రూపంలో ఉండకూడదని అన్నారు.

న్యాయవ్యవస్థలో వస్తున్న మార్పులు, దాని ఆలోచనా విధానాన్ని తప్పక తెలుసుకోవాలని, అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు.

కేసులు న్యాయ స్థానంలోకి రావడానికి ముందే పరిష్కరించుకునేలా తప్పని సరిగా మధ్యవర్తిత్వ వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డ ఆయన.. దురదృష్టవశాత్తూ ఏ కోర్సు కూడా దీన్ని బోధించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సొంత తప్పును సరిదిద్దుకోవడమే...

సుప్రీంకోర్టులో కేసుల కేటాయింపు విషయమై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గతేడాది సుప్రీంకోర్టు నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం సొంత తప్పును సరిదిద్దుకోవడమే అని తెలిపారు.

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఆ రాష్ట్ర హైకోర్టు నూతన భవనాన్ని ప్రారంభించిన ఆయన... న్యాయ వ్యవస్ధ తన తప్పును సరిదిద్దుకోవాలని విశ్వసిస్తానని తెలిపారు. 2018లో సీనియర్ న్యాయవాదుల మీడియా సమావేశంలో కూడా అదే జరిగిందని పేర్కొన్నారు.

''న్యాయప్రక్రియ తాత్కాలికంగా ఉండరాదు. తక్షణ న్యాయం సాధ్యపడదు. అదే విధంగా న్యాయం అనేది ప్రతీకార రూపంలో కూడా ఉండకూడదు.

న్యాయవ్యవస్థ.. తన తప్పును సరిదిద్దుకోవాలని నేను విశ్వసిస్తా. నిజానికి గతేడాది సుప్రీం కోర్టు తీరుపై అసంతృప్తితో.. న్యాయమూర్తులు చేసిన మీడియా సమావేశంలో కూడా అదే జరిగింది. ఆ సమావేశం స్వీయ దిద్దుబాటు కోసం చేసింది మాత్రమే. కానీ.. నేను దానిని సమర్థించేందుకు ఇష్టపడను.''

-జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే, భారత ప్రధాన న్యాయమూర్తి.

సమావేశం నిర్వహించిన న్యాయమూర్తులందరూ ప్రముఖ వ్యక్తులు అని తెలిపిన జస్టిస్​ బోబ్డే.. వారిలో జస్టిస్‌ రంజన్‌ గొగొయి న్యాయవ్యవస్ధను ముందుండి నడిపారని ప్రశంసించారు.

Last Updated : Dec 7, 2019, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details