ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కార్యకలాపాలను లాక్‌డౌన్‌కు ముందులా నిర్వహించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు బార్‌కౌన్సిల్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమైన జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల న్యాయమూర్తుల కమిటీ తమ నిర్ణయాన్ని వెల్లడించింది.
వైద్య నిపుణుల సలహా మేరకు ప్రస్తుతానికి భౌతిక రూపంలో కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణలను జరపాలని నిర్ణయించినట్లు వివరించారు. రెండు వారాల తర్వాత బార్ ప్రతినిధులతో మరో సారి సమావేశమై తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందం తెలిపింది.