భాజపా జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా కరోనా నుంచి కోలుకున్నట్టు ప్రకటించారు. తన కుటుంబ సభ్యులు సైతం సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
''నేను కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. నేను, నా కుటుంబ సభ్యులం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాం. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్. రణదీప్ గులేరియా, ఆయన బృందం చేసిన సేవలు మరువలేనివి.''