తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జోషికి దక్కని టికెట్.. వరుణ్​, మేనక స్థానాల మార్పు - BJP

యూపీలోని మరో 29స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది భాజపా. సీనియర్​ నేత మురళీ మనోహర్​ జోషికి స్థానాన్ని కేటాయించలేదు. కేంద్ర మంత్రి మేనకా గాంధీ, ఆమె కుమారుడు వరుణ్​ గాంధీల స్థానాలను  పరస్పరం మార్చింది.

జోషికి దక్కని టికెట్.. వరుణ్​, మేనక స్థానాల మార్పు

By

Published : Mar 26, 2019, 11:43 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని మరో 29 లోక్​సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. సీనియర్​ నేత మురళీ మనోహర్​ జోషికి టికెట్​ కేటాయించలేదు. ఆయన 2014లో కాన్​పూర్​ స్థానం నుంచి గెలుపొందారు.

సీట్ల మార్పు..

కేంద్ర మంత్రి మేనకా గాంధీ, ఆమె కుమారుడు ఎంపీ వరుణ్​ గాంధీ స్థానాలను పరస్పరం మార్చింది. ఒకరి స్థానంలో మరొకరు పోటీ చేయనున్నారు.
ప్రస్తుతం మేనకా గాంధీ సుల్తానాపూర్​ నియోజకవర్గానికి, వరుణ్ గాంధీ ఫిలిబిత్ నియోజకవర్గానికి ఎంపీలుగా ఉన్నారు.

జయప్రదకు రామ్​పూర్​..

మంగళవారమే పార్టీలో చేరిన ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు రామ్​పూర్​ లోక్​సభ స్థానాన్ని కేటాయించింది భాజపా.

కేంద్ర మంత్రి మనోజ్​ సిన్హా సిట్టింగ్ స్థానమైన ఘాజీపూర్​ నుంచి పోటీ చేయనున్నట్లు భాజపా కార్యదర్శి అరుణ్​ సింగ్ తెలిపారు.

రీటా బహుగుణ జోషి అలహాబాద్ నుంచి​, సత్యదేవ్​ పచౌరీ కాన్​పూర్​ నుంచి బరిలో దిగనున్నట్లు తెలిపారు.


అగ్రనేతలకు టికెట్​ నిరాకరణ

2014 ఎన్నికల్లో కాన్​పూర్​ నుంచి గెలుపొందిన సీనియర్​ నేత మురళి మనోహర్​ జోషి భాజపా టికెట్​ నిరాకరించింది. ఆయనతో పాటు పార్టీ అగ్రనేత ఎల్​.కె.అడ్వాణీ, మరో సీనియర్​ నేత బి.సి.కందూరీ కల్​రాజ్​ మిశ్రాలకు కూడా అధిష్టానం టికెట్​ ఇవ్వలేదు.

ఇదీ చూడండి:కేంద్రమంత్రి ముందే కార్యకర్తల 'పాదరక్షల ఫైట్'!

ABOUT THE AUTHOR

...view details