తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫేస్​బుక్​, ట్విట్టర్​కు పార్లమెంటరీ కమిటీ సమన్లు - ఫేస్​బుక్​

సామాజిక మాధ్యమ దిగ్గజాలు ఫేస్​బుక్, ట్విట్టర్​కు సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. ఖాతాదారుల వ్యక్తిగత డేటా భద్రత, గోప్యతపై తలెత్తిన సమస్యపై కేంద్రం నియమించిన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

PAR-SOCIAL MEDIA
ఫేస్​బుక్

By

Published : Oct 23, 2020, 5:10 AM IST

ఖాతాదారుల వ్యక్తిగత డేటా భద్రత, గోప్యతపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ సంస్థలకు సమన్లు జారీ చేసింది. వ్యక్తిగత డేటా భద్రత బిల్లు-2019కు సంబంధించి జారీ చేసిన సమ‌న్లపై ఫేస్‌బుక్‌ ఇండియా ప్రతినిధులు శుక్రవారం హాజరుకావాలని.. కమిటీ ఆదేశించింది.

ప్యానెల్‌ ముందు అక్టోబర్‌ 28లోపు ట్విట్టర్‌ అధికారులు హాజరు కావాలని లోక్‌సభ సచివాలయం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఇదే అంశంపై అమెజాన్‌, గూగుల్‌ సంస్థల ప్రతినిథులను పిలిపించే అంశాన్ని... సంయుక్త పార్లమెంట్‌ కమిటీ పరిశీలిస్తోందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే ఎవరినైనా పిలుస్తామని, సామాజిక మాధ్యమాల్లో డేటా భద్రత,గోప్యత అంశాలపై పార్లమెంటరీ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేస్తుందని కమిటీ ఛైర్మన్‌ మీనాక్షి లేఖి తెలిపారు.

కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోని లేహ్‌ను చైనాలో భాగంగా చూపిస్తూ ట్విట్టర్‌ లొకేషన్‌ సెట్టింగ్‌ను ఏర్పాటు చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌, ఫేస్‌బుక్ ప్రతినిథులను సంయుక్త పార్లమెంటరీ సంఘం పిలిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి:బిహార్​ బరి: వారసుల సమరంతో రసవత్తరంగా రణం

ABOUT THE AUTHOR

...view details