దిల్లీలోని జేఎన్యూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు.. ముఖాలకు మాస్కులు ధరించి.. విద్యార్థులపై దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్ సహా చాలా మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. జేఎన్యూ అధ్యాపకుల సంస్థ నేతృత్వంలో జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్లో ఘర్షణ చెలరేగిందని తెలుస్తోంది. ఏబీవీపీ కార్యకర్తలు, జేఎన్యూ విద్యార్థులకు మధ్య ఈ ఘర్షణ తలెత్తినట్లు సమాచారం.
అయితే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి.ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులపై రాళ్లు రువ్వి దాడికి పాల్పడినట్లు ఆరోపించింది విద్యార్థి సంఘం. దౌర్జన్యంగా యువతి, యవకులు వసతి గృహంలోకి ప్రవేశించి.. దాడి చేశారన్నారు.
"ఏబీవీపీ కార్యకర్తలు ముసుగులు ధరించి లాఠీలు,రాడ్లు, సుత్తులతో కాలేజీ ప్రాంగణం చుట్టుముట్టారు. మాపై రాళ్లు రువ్వారు. దౌర్జన్యంగా వసతి గృహంలోకి ప్రవేశించి విద్యార్థులను చితకబాదారు. అధ్యాపకులపైనా దాడికి పాల్పడ్డారు."
-జేఎన్యూ విద్యార్థి సంఘం