తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జేఎన్​యూలో ఉద్రిక్తత.. 100మంది అరెస్ట్​

దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థులు చేపట్టిన ఛలో పార్లమెంట్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. పార్లమెంట్‌ వైపు  ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను అడ్డుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా... 100 మంది నిరసనకారులు సహా విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఐషే ఘోష్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

'ఛలో పార్లమెంట్'​ ఉద్రిక్తతలు... 100 మంది అరెస్ట్

By

Published : Nov 19, 2019, 5:53 AM IST

Updated : Nov 19, 2019, 8:19 AM IST

జేఎన్​యూలో ఉద్రిక్తత.. 100మంది అరెస్ట్​

దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులు చేపట్టిన ఛలో పార్లమెంట్ మార్చ్‌ ఉద్రిక్తతలకు దారితీసింది. హాస్టల్ ఫీజుల పెంపునకు నిరసనగా గత మూడు వారాలుగా జెఎన్​యూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. హాస్టల్ మాన్యువల్ ముసాయిదా, హాస్టల్ ఫీజుల పెంపు, డ్రెస్‌ కోడ్‌కు వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టారు విద్యార్థులు.

800 మంది భద్రతా సిబ్బంది...

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో...పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు విద్యార్థులు. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయం వెలుపల సుమారు 800 మంది భద్రతా సిబ్బందిని మోహరించిన పోలీసులు.. పార్లమెంట్ వైపు వస్తున్న విద్యార్థులను విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం నుంచి 600 మీటర్ల దూరంలోపే బారీకేడ్లను ఏర్పాటు చేసి అడ్డుకున్నారు.

100 మంది అరెస్ట్​...

ఫీజుల పెంపు నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునే వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశాయి విద్యార్థిసంఘాలు. కొంత మంది విద్యార్థులు పార్లమెంట్‌ ముట్టడికి మరో మార్గం ద్వారా ప్రయత్నించటం వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటనలో దివ్యాంగులతో సహా 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. మరో 100 మంది విద్యార్థులతో సహా, విద్యార్థి సంఘం నాయకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

144 సెక్షన్​...

మార్చ్ నేపథ్యంలో సోమవారం పార్లమెంట్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. పార్లమెంట్ సమీపంలోని మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేశారు. ట్రాఫిక్‌ను సైతం దారి మళ్లించారు.

త్రిసభ్య కమిటీ...

మరోవైపు విశ్వవిద్యాలయంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా సూచనలు చేసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ.... త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ... విద్యార్థులు, వర్సిటీ యంత్రాంగంతో చర్చలు జరుపుతుంది. అదే సమయంలో సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తుంది.

ఇదీ చూడండి:సైనిక తరహా దుస్తుల్లో రాజ్యసభ మార్షల్స్​!

Last Updated : Nov 19, 2019, 8:19 AM IST

ABOUT THE AUTHOR

...view details