తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఝార్ఖండ్​: పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు.. ఒకరి మృతి - J'khand: 1 died as cops open fire after group tries to snatch weapons outside poll booth

ఝార్ఖండ్ రెండో దశ పోలింగ్​లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గుమ్లాలోని సిసాయి నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద స్థానికులు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. అల్లరిని అణిచేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

polling
పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు-ఒకరి మృతి

By

Published : Dec 7, 2019, 11:29 AM IST

Updated : Dec 7, 2019, 3:09 PM IST

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్​లో అవాంఛనీయ ఘటన జరిగింది. పోలీసులు కాల్పులు జరపిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఇద్దరికి గాయాలయయ్యాయి.

గుమ్లాలోని సిసాయి నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రంలో స్థానికులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నేపథ్యంలో పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు కొంతమంది స్థానికులు యత్నించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆగ్రహించిన స్థానికులు పోలీసు ఇన్స్​పెక్టర్​ లక్ష్యంగా రాళ్లదాడి చేశారు.

"బూత్ నెంబర్ 36 వద్ద స్థానికులు పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు యత్నించారు. ఈ కారణంగా పోలీసులు కాల్పులు జరిపారు. "

-పోలీస్ అధికారి

ఇదీ చూడండి: అత్యాచారంపై ప్రశ్నిస్తే ముఖం చాటేసిన డిప్యూటీ సీఎం!

Last Updated : Dec 7, 2019, 3:09 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details