తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్రికెట్ స్కామ్​లో ఫరూఖ్ పాత్రపై ఈడీ విచారణ

పార్లమెంట్ సభ్యుడు, నేషనల్ కాన్ఫరెన్స్ ఛైర్​పర్సన్ ఫరూఖ్ అబ్దుల్లాను.. జమ్ము కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగంపై ఎన్​ఫోర్స్​మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) సోమవారం ప్రశ్నించింది. ఈ చర్యను రాజకీయ ప్రతికారంగా అభివర్ణించారు ఫరూఖ్​ కుమారుడు ఒమర్​ అబ్దుల్లా.

ED questions Farooq Abdullah on jkca scam
జమ్ముకశ్మీర్ కుంభకోణంలో ఫరుఖ్ అబ్దుల్లా పాత్ర

By

Published : Oct 19, 2020, 1:28 PM IST

Updated : Oct 19, 2020, 1:51 PM IST

జమ్ము కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) కుంభకోణంలో ఎంపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఛైర్​పర్సన్​ ఫరూఖ్ అబ్దుల్లాను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ ప్రశ్నించింది.

అధికారిక వర్గాల ప్రకారం.. ఫరూఖ్ అబ్దుల్లా జేకేసీఏ ఛైర్మన్​గా ఉన్నప్పుడు రూ.43 కోట్లు దుర్వినియోగమైన విషయంపై ఆయన్ను ప్రశ్నించినట్లు తెలిసింది. బ్యాంకు దస్త్రాల ఆధారంగా విచారణ సాగినట్లు సమాచారం.

ఇంతకు ముందు ఇదే విషయంలో.. 2019లోనూ ఈడీ ఆయన్ను విచారించింది.

ఈ విషయంపై నేషనల్ కాన్ఫరెన్స్ త్వరలోనే స్పందిస్తుందని ఫరూఖ్ అబ్దుల్లా.. కుమారుడు ఒమర్ అబ్దుల్లా ట్వీట్​ చేశారు. ఇటీవల ‘పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్కర్‌ డిక్లరేషన్‌’ ఏర్పడిన నేపథ్యంలో.. తాజా పరిణామం రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు ఒమర్.

ఇదీ చూడండి:కశ్మీర్​ను చైనాలో భాగంగా చూపిన ట్విట్టర్- నెటిజన్ల ఫైర్

Last Updated : Oct 19, 2020, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details