జమ్ముకశ్మీర్ మాజీ మంత్రి, అప్నీ పార్టీ ఉపాధ్యక్షుడు అజాజ్ చౌధరీ నివాసంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలను పసిగట్టిన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటికొచ్చి త్రుటిలో ప్రాణాలు రక్షించుకున్నారు. సమాచారం అందుకొని ఘటనా స్థలికి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటనలో సుమారు రూ.రెండు కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. రాంబన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
మంటల్లో పూర్తిగా కాలిపోయిన మాజీ మంత్రి ఇల్లు - kashmir crime news
జమ్ముకశ్మీర్ రాంబన్‌లోని మాజీ మంత్రి నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ఇల్లు మొత్తం కాలిపోయింది.
జమ్మూకాశ్మీర్ మాజీ మంత్రి నివాసంలో అగ్నిప్రమాదం
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో తరచూ విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: '2019తో పోలిస్తే మరింత తీవ్రంగా దిల్లీ కాలుష్యం'
Last Updated : Nov 16, 2020, 9:28 AM IST