జమ్ము కశ్మీర్ బారాముల్లాలో భారీ ఉగ్రదాడి ప్రణాళికను పోలీసులు భగ్నం చేశారు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన ముష్కరుడిని అరెస్టు చేశారు. అతని దగ్గరి నుంచి ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని బారాముల్లా పాత బస్తీకి చెందిన మోసీన్ మంజూర్గా గుర్తించినట్లు జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. బారాముల్లాలో కొత్తగా శిక్షణ పొందిన ముగ్గురి బృందంలో మోసీన్ ఒకరని.. జిల్లాలో ఉగ్రదాడులు చేసేందుకు వీరిని నియమించినట్లు పేర్కొన్నారు.